AP Free Bus scheme Postpone : ఏపీలో బస్సు ఫ్రీ మరో 2 నెలలు వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం(Free bus travel) వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం(Free bus travel) ఈనెల 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఆగస్ట్ 15 నుంచి అన్నా క్యాంటిన్లతో పాటు ఉచిత ప్రయాణం అందించాలని కసరత్తు చేసింది. అయితే తాజాగా ఈ పథకాన్ని మరో రెండు నెలల తర్వాత ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇందుకు రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే త్వరలో ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తాజాగా ఆయన మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పడంతో ఈ పథకం అమలు వాయిదా పడనుందని తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అమ్మకు వందనం పేరుతో అమ్మకు పంగనామం పెట్టారని తీవ్ర విమర్శలే చూస్తున్నారు. సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్స్ అంటూ వైసీపీ నేతలు విమర్శించారు. కేవలం ఉచిత బస్సే కాదు ఇచ్చిన హామీలపై చంద్రబాబు దాటవేస్తున్నారని, రాష్ట్రం అప్పుల పాలయిందని చెప్తూ హామీల ఎగవేతకు ప్లాన్ వేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని హామీలు ఇచ్చినప్పుడు అప్పుల విషయం తెలియదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.