Chandrababu : ముగ్గురు పిల్లలున్నా ఫర్వలేదు.. పోటీ చేయవచ్చు!
ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) వీరు కూడా అర్హులే! ఈ నిబంధనను తొలగించాలని చంద్రబాబునాయుడు(chandrababu) ప్రభుత్వం బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత చట్టాన్ని ఎత్తివేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే మొదట ఈ నిబంధనపైనే దృష్టి పెట్టారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఏడాది లేదా ఏడాదిన్నరలో జరగనున్నాయి. ఇప్పుడు నిబంధన సడలిస్తుండటంతో ముగ్గురు పిల్లలున్న గ్రామ, మండల స్థాయి నాయకులు పోటీకి సమాయత్తమవుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించనున్నారు.