టీడీపీ(TDP) ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) అరెస్టుకు పక్కా స్కెచ్‌ వేసింది.

టీడీపీ(TDP) ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) అరెస్టుకు పక్కా స్కెచ్‌ వేసింది. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా చేసుకుని రాజ‌కీయం చేశార‌ని ఆయనపై ఆ పార్టీ కార్యకర్తలకు పీకలదాక కోపం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు(chandrababu) కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేయడంతో ఇది మరింత తీవ్రమైంది. ఎన్నిక‌ల ముందు కూడా వంశీని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని నారా లోకేష్(Nara Lokesh) చాలా వేదిక‌ల‌పై చెప్పిన విష‌యం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్టు కోసం పోలీసులు వెతకారు. వంశీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్, విజయవాడలో మూడు బృందాలు గాలించాయి. చివరగా నిన్న హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో గన్నవరంలోని తన ఇంటి వద్దే వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్ప‌టికే ఈ కేసులో 18మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ వంశీని అదుపులోకి తీసుకున్నారు. గ‌తంలో రెండుసార్లు టీడీపీ త‌ర‌పున‌ గ‌న్న‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా వంశీ గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుండి పోటీ చేసిన ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థి యార్లగడ్డ వెంకటరావు చేతిలో ఓడిపోయారు. అయితే వంశీ అరెస్టుతో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లుగా జగన్‌పై టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా వంశీ స్పందించేవారు. జగన్‌ అండదండలతో చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కూడా దూషించారు. అయితే ఇప్పుడు వంశీకి అండగా ఉంటారా లేదా అన్న అంశంపై చర్చలు నడుస్తున్నాయి. వైసీపీలో కొన్ని వర్గాలు మాత్రం వంశీ వ్యాఖ్యల వల్లే వైసీపీకి ఎంతో కొంత నష్టం జరిగిందనే వాదనలు వినిపించారు. కష్టకాలంలో వంశీకి మద్దతుగా ఉండాలని మరో వర్గం వాదన. అయితే దీనిపై జగన్‌ ఆచితూచి అడుగులు వేస్తారని తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story