Giddi Eshwari : చంద్రబాబును నమ్మారు.. నిలువునా మునిగారు..!
తెలుగుదేశం పార్టీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు(Chandrababu) చేసిన అరాచకీయంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(Giddi Eshwar) పావు అయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSR Congress) నుంచి గెలిచిన ఆమె చంద్రబాబు ప్రలోభాలకు లోనయ్యారు. జగన్మోహన్‌రెడ్డిని(CM Jagan) కాదని చంద్రబాబు శిబిరంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబును నమ్ముకున్నవారెప్పుడూ బాగుపడరనడానికి ఈశ్వరి కూడా మంచి ఉదాహరణ.
తెలుగుదేశం పార్టీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు(Chandrababu) చేసిన అరాచకీయంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(Giddi Eshwari) పావు అయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSR Congress) నుంచి గెలిచిన ఆమె చంద్రబాబు ప్రలోభాలకు లోనయ్యారు. జగన్మోహన్‌రెడ్డిని(CM Jagan) కాదని చంద్రబాబు శిబిరంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబును నమ్ముకున్నవారెప్పుడూ బాగుపడరనడానికి ఈశ్వరి కూడా మంచి ఉదాహరణ. ఇప్పుడు ఆమెను చంద్రబాబు రాజకీయంగా రోడ్డున పడేశారు. పాడేరు టికెట్‌ను గిడ్డి ఈశ్వరికి కాదని, కిల్లు వెంకట రమేశ్‌నాయుడుకి(Killu Venkata Rameshnaidu) ఇచ్చారు. ఇప్పుడు ఆమెకు తత్వం బోధపడింది. జ్ఞానోదయం కలగడంతో చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున ఈశ్వరి గెలుపొందారు. ఆ తర్వాత కొంత కాలానికి తెలుగుదేశంపార్టీలో చేరారు. 2019లో ఆమె ఓడిపోయారు. 2024 ఎన్నికలకు వచ్చే సరికి గిడ్డి ఈశ్వరికి చంద్రబాబునాయుడు పెద్ద హ్యాండిచ్చారు. ఆమెకు బదులుగా కొత్త అభ్యర్థి వెంకటరమేశ్ నాయుడిని టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా పాడేరులో ఈశ్వరి ఇంట్లో తెలుగుదేశంపార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఈశ్వరి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని తీర్మానించారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు మీడియాతో చెప్పారామె! ఈ ఎన్నికల్లో ఈశ్వరి రాజకీయ భవిష్యత్ ఏమిటో స్పష్టం కాబోతున్నది. ఈ సారి కనుక ఆమె చట్టసభకు ఎన్నిక కాకపోతే, ఇక ఆమె పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టే ! తెలుగుదేశంపార్టీలో చేరకుండా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే మె తప్పనిసరిగా మంత్రి అయ్యేవారనే అభిప్రాయం జనాల్లో ఉంది. జగన్‌ను కాదని చంద్రబాబు వెంట వెళ్లి చేజేతులా తన భవిష్యత్తును నాశనం చేసుకున్నారని అనుకుంటున్నారు.