Ganta Srinivasa Rao : ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు గంటాకు స్టీల్ ఫ్యాక్టరీ గుర్తుకొచ్చింది...!
ఆల్ ఆఫ్ సడన్ తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు(Ganta Srinivasa Rao) విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ(Vizag steel Factory) గుర్తుకొచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు గుర్తుకు వచ్చాయి. వారితో సమావేశమవ్వాలనే ఎరుక కలిగింది. వారితో ముచ్చటించిన తర్వాత ఉక్కు పోరాటాన్ని ఉధృతం చేస్తానని గట్టి హామీ ఇచ్చారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ(TDP) ప్రభుత్వమే కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా చూస్తానని మాట కూడా ఇచ్చారు గంటా! విశాఖ ఉక్కు అంశాన్ని తెలుగుదేశంపార్టీ ఎన్నికల మానిఫెస్టోలో(Election Manifesto) పెడతామని వాగ్దానం చేశారు.
ఆల్ ఆఫ్ సడన్ తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు(Ganta Srinivasa Rao) విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ(Vizag steel Factory) గుర్తుకొచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు గుర్తుకు వచ్చాయి. వారితో సమావేశమవ్వాలనే ఎరుక కలిగింది. వారితో ముచ్చటించిన తర్వాత ఉక్కు పోరాటాన్ని ఉధృతం చేస్తానని గట్టి హామీ ఇచ్చారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ(TDP) ప్రభుత్వమే కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా చూస్తానని మాట కూడా ఇచ్చారు గంటా! విశాఖ ఉక్కు అంశాన్ని తెలుగుదేశంపార్టీ ఎన్నికల మానిఫెస్టోలో(ELection Manifesto) పెడతామని వాగ్దానం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడం అన్యాయం అని చెప్పుకొచ్చారు. మూడేళ్ల కిందట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పదవీత్యాగానికైనా సిద్ధమేనంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించరన్న భరోసాతోనే ఆ పని చేసి ఉంటారు గంటా! కానీ ఇన్నాళ్ల తర్వాత ఆ రాజీనామా ఆమోదం పొందింది.' ఠాట్.. నా రాజీనామాను ఎలా ఆమోదిస్తారు? న్యాయం కోసం కోర్టుకు వెళతాను' అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు గంటా శ్రీనివాసరావు. ఇప్పుడు ఉక్కు పోరాటానికి మద్దతు అని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు నిజాయితీగానే ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నారనే అనుకుందాం! టీడీపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టిస్తారనే భావిద్దాం! సపోజ్.. పర్‌సపోజ్ బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిందనే అనుకుందాం! అప్పుడు కూడా ఈ మాట మీద నిలబడతారా? విశాఖ డిమాండ్‌ను బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించగలరా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశంపార్టీ పెద్దగా పోరాటాలు ఏమీ చేయలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టే హఠాత్తుగా వారికి స్టీల్‌ప్లాంట్ గుర్తుకు వచ్చిందని జనం గుసగుసలాడుతున్నారు.