Alapati Rajendra Prasad : టీడీపీకి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుడ్‌బై !
అధికారంలోకి రావడానికి తన ఒక్కడి బలం సరిపోదని భావించిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) జనసేన(Janasena), బీజేపీలతో(BJP) పొత్తు పెట్టుకున్నారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా నాయకులు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు ముందే చెప్పి ఉన్నప్పటికీ పొత్తు ఉన్నా తమకు టికెట్ గ్యారంటీ అని అనుకున్నారు సీనియర్ నాయకులు. అలాంటి వారికే ఇప్పుడు టికెట్ దొరకకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతున్నారు.
అధికారంలోకి రావడానికి తన ఒక్కడి బలం సరిపోదని భావించిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) జనసేన(Janasena), బీజేపీలతో(BJP) పొత్తు పెట్టుకున్నారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా నాయకులు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు ముందే చెప్పి ఉన్నప్పటికీ పొత్తు ఉన్నా తమకు టికెట్ గ్యారంటీ అని అనుకున్నారు సీనియర్ నాయకులు. అలాంటి వారికే ఇప్పుడు టికెట్ దొరకకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతున్నారు. కొందరు పార్టీని వదిలివెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. అలాంటి వారిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Rajendra prasad) ఒకరు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు దారుణంగా అవమానించారు. ఆ మాటకొస్తే ఆయనకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేశారు. జరుగుతున్న పరిణామాలు ఆలపాటిని చాలా బాధిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆలపాటికి బలమైన వర్గం ఉంది. అక్కడ్నుంచి పోటీ చేయడం కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. అయితే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకోవడంతో తెనాలి సీటు కాస్తా జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు(Nadhendla manohar) వెళ్లిపోయింది. తెనాలి పోతే పోయిందిలే , గుంటూరులో ఏదో ఒక సీటు లభిస్తుందనే నమ్మకంతో ఆలపాటి ఉన్నారు. ఇప్పుడు అది కూడా దక్కలేదు. దీంతో ఆలపాటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారు. కార్యకర్తలతో సమావేశం జరిగిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆలపాటి చెప్పారు.