Pawan kalyan : వరద ప్రాంతాలలో మరి చంద్రబాబు ఎలా పర్యటిస్తున్నారు పవన్?
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pardesh) వరద(Floods) బీభత్సం మామూలుగా లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pardesh) వరద(Floods) బీభత్సం మామూలుగా లేదు. విజయవాడ(Vijayawada) నగరంలో అయితే మరీ దారుణం. మూడు రోజులుగా జనం నీళ్లలోనే ఉన్నారు. ఆకలిదప్పులతో ఇబ్బంది పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది(Rescue team) అహర్నిశలు సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) 74 ఏళ్ల వయసులో కూడా అలుపు లేకుండా పర్యటిస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎక్కడ అన్న సందేహం చాలా మందికి కలిగింది. చంద్రబాబు పర్యటిస్తున్నప్పుడు పవన్‌కు ఏమైంది? అనే విమర్శలు కూడా వచ్చాయి. వీటికి పవన్‌కల్యాణ్ ఇచ్చుకున్న క్లారిఫికేషనే హాస్యాస్పదంగా ఉందంటున్నారు బాబు అభిమానులు. తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి, వరద బాధితులను పరామర్శించడానికి వెళితే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, అందుకే తాను వెళ్లలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తాను వెళితే, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అంతా తన చుట్టే ఉంటారని, అప్పుడు బాధితులకు సహాయక చర్యలు అందండం ఆలస్యం అవుతుందని పవన్‌కల్యాణ్ అన్నారు. వరద బాధితులను కలవడంలో తనకు ఎలాంటి సమస్య లేదని, కాకపోతే అలా చేస్తే వరద బాధితులకు సహాయం కాస్తా సమస్యగా మారుతుందని అన్నారు. మీరు వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు పవన్‌తో చెప్పారట! తాను భౌతికంగా వరద ప్రాంతాలలో లేకపోయినా అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తున్నానని అన్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబునాయుడు కూడా సెలెబ్రెటీనే! ఆయనకు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. అలాంటి చంద్రబాబు వరద ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు కదా! ఆయనకు లేని ఇబ్బంది పవన్‌కు ఏమిటని తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ తమలో తాము అనుకుంటున్నారు. కొందరు సోషల్ మీడియాలో పవన్ వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్నారు.