TDP Support To YS Sharmila:షర్మిలకు సపోర్ట్‌గా తెలుగుదేశంపార్టీ!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి రక్తం పంచుకుని పుట్టిన అన్నతో ఉద్దేశపూర్వకంగానే గొడవపెట్టుకున్నారన్న విషయం తెలిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి రక్తం పంచుకుని పుట్టిన అన్నతో ఉద్దేశపూర్వకంగానే గొడవపెట్టుకున్నారన్న విషయం తెలిసిపోయింది. ప్రెస్‌మీట్లు పెట్టి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)ని నానా మాటలు అంటున్నారు. సానుభూతి కోసం కన్నీరు కూడా పెడుతున్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు టీడీపీ(TDP) అనుకూల మీడియాకు ఆస్తుల పంపకం అంశం దొరికింది. తెలుగు రాష్ట్రాలలో మరే సమస్య లేనట్టుగా, జగన్- షర్మిల గొడవ ప్రపంచ సమస్యగా చిత్రీకరిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమింటే షర్మిల గొడవను కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడం. అది షర్మిల సొంత గొడవ అన్నట్టుగా లైట్ తీసుకున్నది కాంగ్రెస్. నిజమే మరి! షర్మిల ఆస్తుల గొడవకు పార్టీకి సంబంధమే లేదు! దీనివల్ల కాంగ్రెస్‌కు ఒనగూడే ప్రయోజనం కూడా ఏమీ లేదు. అందుకే పట్టించుకోవడం లేదు. మరోవైపు జగన్మోహన్‌రెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే ఆయన తరపున మాట్లాడేందుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉంటారు. కౌంటర్లు ఇస్తారు. మరి ఓ జాతీయ పార్టీకి సారథ్యం వహిస్తున్న షర్మిల(YS Sharmila) కోసం ఎక్కువ బాధపడుతున్నది ఓ రీజనల్ పార్టీ కావడమే విచారకరం. అది తెలుగుదేశంపార్టీ కావడం మరింత విచారకరం. కాంగ్రెస్ నాయకుడు తులసీ రెడ్డి(Tulasi Reddy) కొంచెం బెటర్! షర్మిల ఎపిసోడ్‌లో ఆయన జగన్ వైఖరిని తూలనాడారు. ఈయన తప్ప మరే ఇతర కాంగ్రెస్(Congress) నాయకులు షర్మిల సైడు నిల్చోవడం లేదు. ఎన్నికలకు ముందు వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) కూతురు వై.ఎస్.సునీత(Ys Sunitha)ను వెంటపెట్టుకుని నానా రచ్చ చేశారు షర్మిల. వివేకాను చంపింది జగనే అన్నట్టుగా మాట్లాడారు. అంతగా తిరిగిన సునీత కూడా ఇప్పుడు పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. షర్మిలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశంపార్టీ నేతలే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు ఇలా అందరూ షర్మిలకు మద్దతుగా నిలుస్తూ జగన్‌ను తిట్టిపోస్తున్నారు. అంతెందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే(CM Chandrababu naidu) స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పైగా జగన్ వంటి వారితో రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుగా ఉందంటూ ఎప్పుడూ పెద్దగా నవ్వని చంద్రబాబు నవ్వుతూ చెప్పడం విశేషం. ఇవన్నీ చూస్తుంటే షర్మిలను వెనుక నుంచి ఆడిస్తున్నది ఎవరో అర్థమవుతున్నది కదా!