టీడీపీ-జనసేన- బీజేపీ(TDP Janasena BJP Alliance) ఒక్కటైన వేళా విశేషం బాగోలేనట్టుగా ఉంది. సీట్లు సర్దుబాటే గందరగోళంగా జరిగింది. ఇక అభ్యర్థుల ఎంపిక అయితే చెప్పనే వద్దు. మొత్తంగా కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వారిని సర్దిచెప్పే నాయకుడే కరువయ్యారు. చాన్నాళ్లుగా అసెంబ్లీ, ఎంపీ టికెట్‌ తమకే గ్యారంటీ అనుకున్నవారు ఇప్పుడు సీట్లు దక్కకపోవడంతో హతాశులయ్యారు.

టీడీపీ-జనసేన- బీజేపీ(TDP Janasena BJP Alliance) ఒక్కటైన వేళా విశేషం బాగోలేనట్టుగా ఉంది. సీట్లు సర్దుబాటే గందరగోళంగా జరిగింది. ఇక అభ్యర్థుల ఎంపిక అయితే చెప్పనే వద్దు. మొత్తంగా కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వారిని సర్దిచెప్పే నాయకుడే కరువయ్యారు. చాన్నాళ్లుగా అసెంబ్లీ, ఎంపీ టికెట్‌ తమకే గ్యారంటీ అనుకున్నవారు ఇప్పుడు సీట్లు దక్కకపోవడంతో హతాశులయ్యారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్‌గా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశంపార్టీలో అసంతృప్తి భగ్గుమంది. జనసేన నాయకుడు ఆరని శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడుతున్నారు. టికెట్ దక్కలేదని మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ కోసమే రేయింబవళ్లు పని చేశామని, ఇప్పుడు టికెట్‌ను మరొకరికి ఇవ్వడం బాధాకరమని సుగుణమ్మ అన్నారు. తిరుపతి స్థానాన్ని జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరికో మద్దతు పలకమని చెబితే తాను ఒప్పుకున్నా క్యాడర్‌ అందుకు అసలు అంగీకరించదని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలొచిస్తారని నమ్ముతున్నానని అన్నారు. ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వారికి టికెట్‌ కేటాయిస్తే ప్రజలు అంగీకరించడం లేదన్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచన తనకు లేదని చెప్పిన సుగుణమ్మ(Sugunamma) తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేశారు.

Updated On 25 March 2024 4:53 AM GMT
Ehatv

Ehatv

Next Story