నంద్యాలలో(Nandyala) తీవ్ర‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ(TDP) నాయ‌కురాలు భూమా అఖిల ప్రియను(Bhuma Akhila Priya) పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్రబాబు అరెస్టుకు(TDP Arrest) నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

నంద్యాలలో(Nandyala) తీవ్ర‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ(TDP) నాయ‌కురాలు భూమా అఖిల ప్రియను(Bhuma Akhila Priya) పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్రబాబు అరెస్టుకు(Chandrababu Arrest) నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ‌నివారం తెల్లవారుజామున అఖిల ప్రియ‌, ఆమె తమ్ముడు విఖ్యాత్ రెడ్డి(Vikyath Reddy), భర్త భార్గవ్‌రామ్‌ను(Bhargavram) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు. ఇంట్లో కూర్చోబెట్టినంత మాత్రాన దీక్షను ఆపేది లేదని అఖిలప్రియ అన్నారు. నా తమ్ముడికి ఏదైనా జరిగితే అందుకు నంద్యాల ఎస్పీ, డీఎస్పీలే బాధ్యత వహించాలని అఖిల ప్రియ సంచలన వాఖ్యలు చేశారు.

నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాల్‌(RK Fnction Hall) వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు. దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు. ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు. ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు.

Updated On 23 Sep 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story