ముఖ్యమంత్రి జగన్(CM Jagan), కొడాలి నాని(Kodali Nani), వైసీపీ మంత్రులపై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా(devineni Uma) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని సంస్కారహీనుడని విమ‌ర్శించారు. గుడివాడ ప్రజలు నీ బట్టలు విప్పిదీసి అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో.. నీకు అదే గతి పట్టించబోతున్నారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సన్న బియ్యం ఇస్తానన్న సన్నాసి.. పేదవాళ్ళకిచ్చే బియ్యాన్ని రీసైకిల్ చేసి 56 వేల కోట్ల రూపాయల బియ్యం విదేశాలకు తరలించారని ఆరోపించారు

వైసీపీ బూతుల మంత్రులు సంస్కారహీనులు అని అన్నారు. ఇరిగేషన్ మంత్రి నువ్వు రాంబాబు అయితే మాకేంటి..! శ్యామ్ బాబువి అయితే మాకేంటి ? అని సెటైర్లు సంధించారు. పవన్ కళ్యాణ్(Pawan kalyan) సినిమా గురించి కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నాడు.. ఏలేరు రిజర్వాయర్ తెలుసా.? పురుషోత్తపట్నం ప్రాముఖ్యత గురించి నీకు తెలుసా.? గాజువాక స్టీల్ ఫ్యాక్టరీ ఏరియాలో నీళ్లు ఇచ్చావా.? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపించారు.

మూర్ఖత్వంతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడ‌ని ఆరోపించారు. చంద్రబాబు కట్టారని పురుషోత్తమ పట్నం ప్రాజెక్ట్ ను గాలికి వదిలేశాడ‌ని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. పురుషోత్తమపట్నానికి అటువైపు పట్టిసీమ ఉందని.. పోలవరం ప్రధాన కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమతో కృష్ణాడెల్టాకు గోదావరి నీళ్లు అందించామ‌ని తెలిపారు.

శ్రీశైలంలో నిల్వచేసిన మిగులు కృష్ణాజలాలను రాయలసీమకు తరలించామ‌న్నారు. పురుషోత్తమపట్నం లిఫ్ట్ ద్వారా ఏలేరుకు నీటిని తరలించి ఆ నీటిని విశాఖపట్నానికి తరలించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారన్నారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఆలోచించార‌ని.. ఆనాడు భూములిచ్చిన వారికి చంద్రబాబు న్యాయం చేశారని అన్నారు. ఇచ్చిన పరిహారం చాలదని, అంత ఇస్తాను.. ఇంత ఇస్తాను అనిచెప్పి, రైతుల్ని రెచ్చగొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పరిహారం ఎందుకు ఇవ్వడంలేదని ప్ర‌శ్నించారు. పోలవరం నిర్వాసితుల్ని కూడా ఇదేమాదిరి మోసగించాడని సీఎం జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు.

Updated On 9 Aug 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story