Congress check to YCP: అధికార వైసీపీకి కాంగ్రెస్ గండం !
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? గతంలో కాంగ్రెస్ ను వీడిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటారా? అంటే..అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ..తాజాగా ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు వైఎస్ షర్మిలను తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో విజయవకాశాలను అందింపుచ్చుకోవాలనే ఆలోచనతో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి కాంగ్రెస్ రూపంలో గండం పొంచి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణ ఫలితాలతో ఫుల్ జోష్ మీద ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఏపీ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టింది. ఏపీ కాంగ్రెస్(ap congress) బాధ్యతలను వైఎస్ షర్మిల(YS Sharmila)కు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. రాష్ట్ర విభజనతో ఏపీలో పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్ కు పూర్వవైభవ తీసుకొచ్చేందుకు ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రాన్ని ఇచ్చింది..తెచ్చింది తామేనంటూ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్..ఏపీలో కొత్త నినాదాన్ని తెరపైకి తెస్తోంది. రాష్ట్ర విభజన హామీలు ఇచ్చింది మేమే..వాటిని అమలు చేసేది కూడా తామేనంటూ ఏపీలో ప్రచారాన్ని మొదలు పెట్టారు ఆ పార్టీ నేతలు. ప్రత్యేక హోదాతోపాటు పోలవరం పూర్తి చేస్తామని ఆ మధ్య ఏపీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant)కు సొంత గనులు కేటాయించడంతోపాటు ప్రభుత్వరంగంలో కొనసాగేట్లు సహకారం అందిస్తామని జోడోయాత్ర(Jodoyatra)సందర్భంగా ఏపీ ప్రజలకు రాహుల్ హామీ ఇచ్చారు. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై పన్నులు ఎత్తేస్తామన్నారు. అసలు జీఎస్టీ కౌన్సిల్‌నే రద్దు చేస్తామని జోడో యాత్ర సందర్భంగా రాహుల్ వెల్లడించారు. ఇవిగాకుండా కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా మరికొన్ని అంశాల మేనిఫెస్టోతో ముందుకొస్తే ఏపీలోనూ కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నమాట.
మరోవైపు తెలంగాణలో లోపాయికారింగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన టీడీపీ.. ఏపీలోనూ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు అధికార వైసీపీకి దడ పుట్టిస్తోంది. ఇప్పటికే ఇంఛార్జీల మార్పుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేతలు.. ప్రత్యా్మ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంగళగి ఎమ్మెల్యే(Mangalagi MLA) ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy)తోపాటు మరికొందరు నేతలు పార్టీ వీడిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీలోని సీనియర్లంతా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే. వీళ్లంతా మళ్లీ సొంత గూటికి చేరుతారనే ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. సీఎం జగన్(cm jagan)తో ఇమడలేకపోతున్న సీనియర్లకు ఇప్పటి వరకు సరైన ప్రత్యామ్నాయం దొరకలేదు. ఇష్టమున్నా లేకున్నా వైసీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ(tdp-congress alliance) చేస్తే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే..వైసీపీ అధికారానికి గండిపడటం ఖాయమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
.