Chittoor TDP MLA Candidate Gurajala Jagan Mohan : టీడీపీ అభ్యర్థి కళాపోషణ.. ఇద్దరమ్మాయిలతో రికార్డింగ్ డాన్సలు!
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం(Chittoor Constituency) నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్(Gurajala Jagan Mohan) నాయుడు బయటేమిటో కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులరవుతున్నారు. నెగటివ్‌గా సుమీ! మొన్నామధ్య ఓ బైకు నడిపిన జగన్మోహన్‌రెడ్డి తన రెండు చేతులు వదిలేస్తూ జాతీయ రహదారిపై చేసిన స్టంట్ల దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Chittoor TDP MLA Candidate Gurajala Jagan Mohan
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం(Chittoor Constituency) నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్(Gurajala Jagan Mohan) నాయుడు బయటేమిటో కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులరవుతున్నారు. నెగటివ్‌గా సుమీ! మొన్నామధ్య ఓ బైకు నడిపిన జగన్మోహన్‌రెడ్డి తన రెండు చేతులు వదిలేస్తూ జాతీయ రహదారిపై చేసిన స్టంట్ల దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ దృశ్యాలు చూసి నెటిజన్లు తెగ నవ్వుకున్నారు. యువత తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. పది మందికి నీతులు చెప్పాల్సిన జగన్మోహన్ నాయుడు ఇలా చేయడమేమిటని తిట్టిపోశారు. కనీసం హెల్మెట్ అయినా పెట్టుకోవాలని తెలియదా అని నిలదీస్తున్నారు. రోడ్డుపై చేసిన ఆ పిచ్చి స్టంట్లకు పోలీసుల పర్మిషన్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత అవగాహన లేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తారు అని విమర్శిస్తున్నారు. ఈ వివాదం సమసిపోకముందే కొత్త వివాదాన్ని నెత్తిన చుట్టుకున్నారు జగన్మోహన్ నాయుడు. ఆయనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోతో ఆయన గారి కళాపోషణ పది మందికి తెలిసిపోయింది. ఇద్దరు అమ్మాయిలతో ఆయన చేసిన రికార్డింగ్ డాన్సులు ఫ్యాన్స్‌కేమో కానీ మిగతావారికి మాత్రం వెగటు పుట్టిస్తోంది. 'బెంగళూరులో పబ్బులు, డిస్కోథెక్కులు, బార్లలో గెంతులేసే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకోవడం అంటూ ఈ వీడియోలను ట్రోల్ చేస్తున్నారు చాలా మంది.
