Chandrababu : ఈసారి సంక్రాంతికి చంద్రబాబు సొంతూరుకు వెళ్లడం లేదు..కారణమేమిటంటే..!
తెలుగువారికి సంక్రాంతి(Sankranti) పెద్ద పండుగ. పంటసిరి చేతికొచ్చే కాలం! రైతులకు కాసింత వెసులుబాటు కలిగే సమయం! అందుకే సంక్రాంతి పండుగ వేళ చాలా మంది సొంతూళ్లకు వెళతారు. పట్టణవాసులంతా పల్లెబాట పడతారు. బంధు మిత్రుల సమక్షంలో పండుగ సంబరాలను జరుపుకుంటారు. విందుభోజనాలు ఆరగిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) కూడా సంక్రాంతి పండుగ సందర్భంలో కుటుంబసమేతంగా సొంతూరు నారావారి పల్లెకు వెళుతుండేవారు. మధ్యలో మూడేళ్ల విరామం వచ్చింది. ఆ మూడేళ్లు అమరావతి రైతుల సమక్షంలో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకున్నారు.
తెలుగువారికి సంక్రాంతి(Sankranti) పెద్ద పండుగ. పంటసిరి చేతికొచ్చే కాలం! రైతులకు కాసింత వెసులుబాటు కలిగే సమయం! అందుకే సంక్రాంతి పండుగ వేళ చాలా మంది సొంతూళ్లకు వెళతారు. పట్టణవాసులంతా పల్లెబాట పడతారు. బంధు మిత్రుల సమక్షంలో పండుగ సంబరాలను జరుపుకుంటారు. విందుభోజనాలు ఆరగిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) కూడా సంక్రాంతి పండుగ సందర్భంలో కుటుంబసమేతంగా సొంతూరు నారావారి పల్లెకు వెళుతుండేవారు. మధ్యలో మూడేళ్ల విరామం వచ్చింది. ఆ మూడేళ్లు అమరావతి రైతుల సమక్షంలో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకున్నారు. నిరుడు సంక్రాంతి పండుగప్పుడు చంద్రబాబు నారావారిపల్లెలోనే ఉన్నారు. లాస్టియర్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా నారావారి పల్లెకు వెళ్లారు. బావతో కలసి పండుగ చేసుకున్నారు. చంద్రబాబు నారావారి పల్లె పర్యటన మామూలుగా ఉండదు. మూడు రోజుల పాటు టీడీపీ అనుకూల మీడియా అంతా ఆ కవరేజ్‌లోనే ఉండేది. ఏమైందో ఏమో ఈసారి కూడా చంద్రబాబు సొంతూరుకు వెళ్లడం లేదు. ఓపక్క సీఎం జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎన్నికలకు సంసిద్ధులవుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. లోక్‌సభ అభ్యర్థులను(MP Candidates) కూడా ఎంపిక చేస్తున్నారు. 50 శాతానికి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు కాసింత వెనుకబడ్డారు. ఇలాంటి తరుణంలో సంక్రాంతి కోసమని మూడు రోజులు ఊరికి వెళ్లే బదులు హైదరాబాద్‌లోనే ఉంటూ ఎన్నికల ప్రణాళికలను రచించుకోవాలని అనుకున్నారో ఏమో! అసలు సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లడమనే సంప్రదాయం చంద్రబాబు నుంచే మొదలయ్యింది. ఇది స్వయంగా చంద్రబాబే చెప్పిన మాట! తాను నారావారిపల్లెకు వెళుతున్నప్పటి నుంచి తెలుగు ప్రజలు సంక్రాంతికి ఊరికెళ్లడం అలవాటు చేసుకున్నారని అప్పట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిత్రమేమిటంటే ఈ మాటలు టీడీపీ అనుకూల మీడియా గొప్పగా ప్రచారం చేయడం! ఆ లెక్కన ఇప్పుడు చంద్రబాబు సంక్రాంతికి ఊరుకెళ్లడం లేదు కాబట్టి, తెలుగువారంతా ఊరెళ్లడం మానేస్తారేమో! పందెంకోళ్లు పందాలు మానేస్తాయేమో!