టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మార్చి 2న నెల్లూరు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) మార్చి 2న నెల్లూరు(Nellore) జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు గ్రామంలో జ‌రిగే స‌భ‌లో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి(Vemireddy Prabhakara Reddy), ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి(Prashanthi) టీడీపీలో చేరనున్న‌ట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 2 రాత్రి కనుపర్తిపాడు గ్రామంలోని వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కన్వెన్షన్ హాల్ (విపిఆర్ కన్వెన్షన్ హాల్)లో చంద్ర‌బాబు బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి, గూడూరు, సూళ్లూరుపేట స్థానాలకు తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థులతోపాటు వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలతో టీడీపీ అధినేత చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో పేర్లు లేని పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలతో చర్చిస్తార‌ని కూడా చెబుతున్నారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీలో చేర‌నున్న‌ నేపథ్యంలో.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేత‌లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated On 27 Feb 2024 9:16 PM GMT
Yagnik

Yagnik

Next Story