తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మర్చిపోలేరు. మర్చిపోరు కూడా! ఎందుకంటే ఆ సిద్ధాంతం ఆయన పేటెంట్‌! ఆయనకు మాత్రమే సొంతం! తెలంగాణకు మద్దతుగా లేఖ రాసిందీ చంద్రబాబే. తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటన చేస్తే గాయ్‌గత్తర లేపి దాన్ని అడ్డకున్నది చంద్రబాబే! ఎవరన్నా అడిగితే కొబ్బరి చిప్పలు, రెండు కళ్లు అంటూ ఏవోవో చెప్పుకున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు, అన్ని చోట్లా ఇలా డబుల్‌గేమ్‌ ఆడుతూనే ఉంటారు. తాజాగా ఆయన చేసిన నిర్వాకం కారణంగా వృద్ధులు, దివ్యాంగులు అష్టకష్టాలు పడుతూ ఫించన్లు తీసుకోవాల్సివస్తున్నది.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మర్చిపోలేరు. మర్చిపోరు కూడా! ఎందుకంటే ఆ సిద్ధాంతం ఆయన పేటెంట్‌! ఆయనకు మాత్రమే సొంతం! తెలంగాణకు మద్దతుగా లేఖ రాసిందీ చంద్రబాబే. తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటన చేస్తే గాయ్‌గత్తర లేపి దాన్ని అడ్డకున్నది చంద్రబాబే! ఎవరన్నా అడిగితే కొబ్బరి చిప్పలు, రెండు కళ్లు అంటూ ఏవోవో చెప్పుకున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు, అన్ని చోట్లా ఇలా డబుల్‌గేమ్‌ ఆడుతూనే ఉంటారు. తాజాగా ఆయన చేసిన నిర్వాకం కారణంగా వృద్ధులు, దివ్యాంగులు అష్టకష్టాలు పడుతూ ఫించన్లు తీసుకోవాల్సివస్తున్నది. ఫించన్లను, రేషన్‌ను చంద్రబాబే అడ్డుకుంటారు. మళ్లీ ఆయనే సకాలంలో ఫించన్లు ఇచ్చేయాలటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తారు. చంద్రబాబు రెండు నాలుకుల వైఖరి ఇలాగే ఉంటుంది. గ్రామ, వార్డు సచి­వాలయ వ్యవస్థలో భాగంగా జగన్మోహన్‌ రెడ్డి(CM jagan) ప్రభు­త్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇం­టి దగ్గరే పెన్షన్‌లను(Pensions) అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు. వలంటీర్ల వ్యవస్థతో ప్రజలు హాయిగా ఉంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం వలంటీర్ల వ్యవస్థపై మొదట్నుంచి విషమే కక్కుతున్నారు. వలంటీర్లపై(Volunteers) చంద్రబాబు, ఆయన భాగస్వామి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వలంటీర్లు అర్థరాత్రుళ్లు, ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని, ఆ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు చాలాసార్లు డిమాండ్‌ చేశారు. పవన్‌ అయితే ఓ రెండు అడుగులు ముందుకేసి ఏపీలో వేలాది మంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గం తనకు ఈ విషయాన్ని చెప్పిందంటూ పచ్చి అబద్ధమాడారు. ఇలా భాగస్వాములిద్దరూ వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కారు. సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతుండటంతో జగన్‌ ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ పెరిగింది. ఇది చంద్రబాబుకు నచ్చలేదు. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అడ్డం పెట్టకుని వలంటీర్ల వ్యవస్థపై బురద చల్లారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పని చేశారో చూశాం! స్థానిక సంస్థల ఎన్నికలను తెలుగుదేశం పార్టీ కోసం హఠాత్తుగా వాయిదా వేసి రాజ్యాంగాన్నే అపహాస్యం చేశారా పెద్ద మనిషి. ఎన్నికల అధికారిగా ఉంటూనే హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ను కలసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చంద్రబాబు కోసం నిమ్మగడ్డ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. రిటైరయ్యాక కూడా ఇంకా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు. సిటిజన్‌ డెమొక్రటిక్‌ ఫోర్‌ పేరుతో రాజకీయాలు నడుపుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు కోర్టులో కేసు వేశారు. పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేశారు.

Updated On 1 April 2024 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story