Chandrababu : భవిష్యత్తుపై చంద్రబాబులో మొదలైన ఆందోళన
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రస్తుతం భవిష్యత్తును తల్చుకుని ఆందోళన చెందుతున్నారు. తన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో(Political life) ఇంతటి విపత్కర పరిస్థితిని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదమో! ఎలాగైనా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు! ఈ ఎన్నికలకు ఆయనకు జీవన్మరణ పోరాటం లాంటిదే! గెలవకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రస్తుతం భవిష్యత్తును తల్చుకుని ఆందోళన చెందుతున్నారు. తన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో(Political life) ఇంతటి విపత్కర పరిస్థితిని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదమో! ఎలాగైనా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు! ఈ ఎన్నికలకు ఆయనకు జీవన్మరణ పోరాటం లాంటిదే! గెలవకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్‌ఆర్(YSRCP) కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కష్టమని గ్రహించే ఆయన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన కూడా సరిపోదని భావించి బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీకి(Delhi) వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను(Amit shah), బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు నడ్డాను(JP Nadda) కలిసి వచ్చారు. మరి పొత్తు పొడిచిందో లేదో తెలియదు. బీజేపీతో పొత్తు ఉంటుందని టీడీపీ అనుకూల మీడియా అయితే రాస్తూ వస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు బీజేపీ, జనసేనతో (Janasena)పొత్తు అంతిమంగా ఎలాంటి ఫలితాలను ఇస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే హీనపక్షం ఓ 70 అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవాల్సి వస్తుంది. ఆయా స్థానాలలో ఎప్పట్నుంచో పార్టీ కోసం పని చేస్తూ వస్తున్న వారికి ఎలా నచ్చచెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదు. పొత్తుల్లో భాగంగా త్యాగాలకు సిద్ధపడాలని, టికెట్లు రానివారు కంగారు పడాల్సిన అవసరం లేదని, అధికారంలోకి రాగానే వారికి తగు ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాటలను నేతలు నమ్మడంలేదు. గతంలో ఇలాంటి హామీలను చంద్రబాబు ఎన్నో ఇచ్చి ఉన్నారు. వేటిని ఆయన నెరవేర్చలేదు. అందుకే ఆయన చెప్పే మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పొత్తుల పేరుతో తమ రాజకీయ భవిష్యత్తను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla buchchaiah Choudhary) ఇలాంటి హెచ్చరికనే చేశారు. సిట్టింగ్‌లకు సీట్లు గ్యారంటీ అని చంద్రబాబు గతంలో చెప్పారని, రాజమండ్రి రూరల్ టికెట్ తనదేనని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. రాజమండ్రి రూరల్ జనసేనకు కేటాయిస్తారని వస్తున్న వార్తలపై గోరంట్ల ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. బలమైన క్యాడర్ ఉన్న నేతలను కాదని పొత్తుల పేరుతో జనసేనకో, బీజేపీకో టికెట్ ఇస్తే ఎలా అన్నది టీడీపీ నేతల భావన. ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని నేతలకు టికెట్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఇతర పార్టీల వారిని గెలిపిస్తే తర్వాత వారు టీడీపీ క్యాడర్‌ను పట్టించుకుంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. మొత్తంగా పొత్తు కుదిరినా టీడీపీ క్యాడర్ మనస్ఫూర్తిగా పని చేస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.