Chandrababu : రేపు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిదార్ధ లూథ్రా కుమారుని వివాహం ఆదివారం జరుగుతుండగా.. సోమవారం రిసెప్షన్ జరగనుంది.

TDP chief Chandrababu Visits Delhi tomorrow
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సోమవారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిదార్ధ లూథ్రా(Sidharth Luthra) కుమారుని వివాహం ఆదివారం జరుగుతుండగా.. సోమవారం రిసెప్షన్(Reception) జరగనుంది. ఈ వివాహ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఢిల్లీలోని హోటల్ రీజెన్సీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సిదార్ధ లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలోనే సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari)తో కలిసి చంద్రబాబు ఈ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్(Hyderabad) నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. 28వ తేదీ మంగళవారం వరకూ ఆయన ఢిల్లీలోనే ఉంటారు.
ఇదిలావుంటే.. స్కిల్ కేసు(Skill Development Case)లో చంద్రబాబు బెయిల్(Chandrababu Bail) రద్దు చేయాలన్న సీఐడీ(CID) పిటిషన్‌పై 28న సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించనుంది. స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇటీవల రెగ్యులర్ బెయిల్(Regular Bail) మంజూరు చేయగా.. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సీఐడీ సవాల్ చేసింది. చంద్రబాబు బెయిల్ మంజూరులో హైకోర్టు(High Court) తన పరిధి దాటిందని సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది.
