చంద్రబాబుకు(chandrababu) ఏసీబీ కోర్టులో(ACB Court) మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. చంద్ర‌బాబు త‌రుపు న్యాయ‌వాదులు వేసిన‌ హౌస్ కస్టడీ పిటిషన్(House custody Petition) ఏసీబీ కోర్టు తిరస్కరించింది. రాజమండ్రిలో హైసెక్యూరిటీ ఉంటుందన్న సీఐడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

చంద్రబాబుకు(chandrababu) ఏసీబీ కోర్టులో(ACB Court) మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. చంద్ర‌బాబు త‌రుపు న్యాయ‌వాదులు వేసిన‌ హౌస్ కస్టడీ పిటిషన్(House custody Petition) ఏసీబీ కోర్టు తిరస్కరించింది. రాజమండ్రిలో హైసెక్యూరిటీ ఉంటుందన్న సీఐడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అవినీతి కేసుకు సంబంధించి హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అయితే.. సీఐడీ వద్ద ఉన్న స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు మాత్రం చంద్రబాబు న్యాయవాదులకు న్యాయస్థానం అనుమతిని న్యాయస్థానం మంజూరు చేసింది.

అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy) మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. సీఆర్పీసీలో(CRPC) రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయని పొన్నవోలు వాదించారు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనంతో పాటు మందులు కూడా పంపుతున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు అనుమతి లేనిదే.. ఆ బ్లాక్ లోనికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని.. ఆయ‌న ఆరోగ్య పరిరక్షణకు సైతం ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. అందుకోసమే చంద్రబాబుకు హౌస్ కస్టడీ అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని.. చట్టపరంగా, న్యాయపరంగా నిందితులకు వర్తించే ప్రతి అంశం చంద్రబాబుకు వర్తిస్తుందని వాదించారు.

Updated On 12 Sep 2023 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story