Chandrababu : చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) నివాసంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం(Raja shyamala Yagam) ముగిసింది.

Chandrababu
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) నివాసంలో గత మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం(Raja shyamala Yagam) ముగిసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు(Guntur) చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రుత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి(Bhuwaneswari) దంపతులతో పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ రోజు, అదివారం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.
