నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu). ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అపార అనుభవం గడించిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫార్టీ ప్లస్‌ ఇయర్స్‌ ఇండస్ట్రీ! విజనున్న నేత అని అంటారు ఆయన అభిమానులు.. ఆయనను మోసే పత్రికలు. ఈ భూమండలంలో ఎక్కడ ఏది జరిగినా అది ఆయన ఖాతాలో పడాల్సిందే!

నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu). ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అపార అనుభవం గడించిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫార్టీ ప్లస్‌ ఇయర్స్‌ ఇండస్ట్రీ! విజనున్న నేత అని అంటారు ఆయన అభిమానులు.. ఆయనను మోసే పత్రికలు. ఈ భూమండలంలో ఎక్కడ ఏది జరిగినా అది ఆయన ఖాతాలో పడాల్సిందే! సెల్‌ఫోన్‌ల దగ్గర్నుంచి మొదలు పెడితే చంద్రయాన్‌ -3(Chandrayaan-3) వరకు ఆయన కనిపెట్టినవే! అంతెందుకు నాలుగున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌(Hyderabad) నగరాన్ని కట్టింది కూడా ఆయనే! అంతటి గొప్ప మహానుభావుడికి సొంత ఆలోచనలు తట్టడం లేదు కాబోలు.

అందుకే ముఖ్యమంత్రి జగన్‌ను ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వడమంటే సోషల్‌ మీడియాలో కాదు సుమీ! జగన్‌(Jagan) పథకాలనే ఫాలో అవ్వడం అన్నమాట! ఓ రకంగా కాపీ అంటే సరిపోతుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిన గడప గడప పథకం గుర్తుంది కదా! ఇంటింటికి జగన్‌ స్టిక్కర్లను టీడీపీ ఆడిపోసుకున్న విషయమూ గుర్తున్నది కదా! చంద్రబాబుతో సహా ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దానికి విమర్శించింది. ఎకసెక్కాలు చేసింది. చివరాఖరికి కుక్కలు కూడా స్టిక్కర్లను ఇష్టపడటం లేదని తిట్టిపోశాయి. ఇప్పుడు అవే స్టిక్కర్ల స్కీమ్‌ చంద్రబాబుకు కావాల్సి వచ్చింది.

ఇప్పుడు ప్రతీ ఇంటికి చంద్రబాబు స్టిక్కర్లను ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ(Telugu Desham Party) నిర్ణయించింది. ఫార్టీ ఫైవ్‌ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇప్పుడు జగన్‌ను ఫాలో అవ్వడంపై పెద్ద చర్చనే నడుస్తోంది. అంతేనా.. జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కొండంత రాగాలు తీసిన టీడీపీ ఇప్పుడు అదే సంక్షేమాన్ని తమ ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. మొన్నటి మహానాడులో మహిళలకు బోల్డన్ని వరాలు ప్రకటించారు చంద్రబాబు. అవేమీ ప్రజల్లోకి వెళ్లలేదు.

వాటిపై జనం మాట్లాడుకోవడం కూడా లేదు. అందుకే ఏడాదిన్నరగా జగన్‌ అమలు చేస్తున్న విధానం మాదిరిగానే ప్రతి ఇంటికీ వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. వైసీపీ తీసుకొచ్చిన గృహ సారథులకు పోటీగా కుటుంబ సారథులను రంగంలోకి దించుతోంది. జగన్ పార్టీ అమలు చేసిన గడప గడపకు ప్రభుత్వం మాదిరిగానే ప్రతీ ఇంటికి టీడీపీ నేతలను 45 రోజులు పంపాలని నిర్ణయించింది టీడీపీ.

Updated On 29 Aug 2023 4:12 AM GMT
Ehatv

Ehatv

Next Story