TDP Chandrbabu : మద్యం స్కాంలో ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతూ వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandra Babu Naidu) విమర్శించారు. తన 45 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇలాంటి అమానుషమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం చిత్తుచిత్తుగా వైకాపా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో(NTR Bhavan) జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు(Blackmail Politics)
జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది
రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం చిత్తుచిత్తుగా వైసీపీ ఓడిపోవడం ఖాయం
నిన్నిక భరించలేం..బై బై జగన్...ఇదే అందరి నినాదం కావాలి
బాబు భరోసా.. భవిష్యత్తుకు గ్యారెంటీ.. అనేదే మన నినాదం
ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతూ వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandra Babu Naidu) విమర్శించారు. తన 45 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇలాంటి అమానుషమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం చిత్తుచిత్తుగా వైకాపా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో(NTR Bhavan) జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘జగన్ పని అయిపోయింది. మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయం. జగన్‌ను(Jagan) చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది. జగన్‌ను భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. దేవుడు స్ర్కిప్ట్ తిరగరాశాడు. అదే వైకాపా పతనం. ప్రజల్లో మమేకమై వైకాపా ఆగడాలు అరికడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటర్లు తెదేపా వైపే ఉన్నారు. ఇండియాటుడే c ఓటర్ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో తెదేపాకు 15 ఎంపీ స్థానాలు రావడం ఖాయం. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా తెలుగుదేశం పార్టీ నిలిచింది. నాలుగున్నర ఏళ్లలో ఏం నష్టపోయామో ప్రజలకు చెప్పాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా మాతో కలిసి రావాలి. నిన్నిక భరించలేం.. బై బై జగన్ .ఇదే అందరి నినాదం కావాలి. ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఎల్లుండి నుంచి ఆందోళనలు. జగన్, పెద్దిరెడ్డి, జే-గ్యాంగ్ రూ.40వేల కోట్ల విలువైన ఇసుక దోచేశారు. 98శాతం హామీలు అమలు చేశామంటూ వైకాపా చెప్పేవన్నీ అబద్ధాలే. తితిదే బోర్డు సభ్యులుగా నేరగాళ్లకు స్థానం కల్పిస్తారా? జగన్ మళ్లీ వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించాలి. బాబు భరోసా.. భవిష్యత్తుకు గ్యారెంటీ.. అనేదే మన నినాదం’’ అని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
టీడీపీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబమాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. టీటీడీ సభ్యుల(TTD Board Members) నియామకంపై కూడా స్పందించారు.మద్యం స్కాంలో(Liquor Scam) ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో సభ్యునిగా స్థానం కల్పిస్తారా? అప్రూవరుగా మారడం అంటే తప్పుడు పని చేశానని ఒప్పుకోవడమే. అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారు?. టీటీడీ సభ్యల నియామకం సహా జగన్ చేస్తున్న అన్ని తప్పిదాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. 98 శాతం హామీల అమలంటూ అబద్దాలు చెబుతున్నారు. పథకాల్లో భారీగా కోతలేశారు. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. రూ. 50 వేల కోట్లను ప్రజలపై విద్యుత్ భారం వేశారు. ఉచిత విద్యుత్ విషయంలో రైతులనూ ఇబ్బంది పెట్టారు. అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను పెంచం. ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఇసుక సత్యాగ్రహం పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
నా ఇసుకపై నీ పెత్తనం ఏంటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. భవిష్యత్తులో వైసీపీ నేతల బట్టలిప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్, పెద్దిరెడ్డి, జే-గ్యాంగ్ రూ. 40 వేల కోట్ల విలువైన ఇసుకను దోచేశారు. పోలవరాన్ని గోదాట్లో ముంచేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను విధ్వంసం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పట్టాలెక్కించారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు. రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితికి తెచ్చారు. కేంద్ర పథకాలకు వాటాలివ్వలేని పరిస్థితుల్లో ఏపీ ఉంది. రూ. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ధరలన్నీ పెంచేశారు. ఒక్క ఇండస్ట్రీ లేదు..ఒక్కరికీ ఉద్యోగం లేదు. కానీ జగన్ అండ్ కంపెనీ అందర్నీ దోచుకుని తిరుగులేని విధంగా తయారైందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ అవినీతిపై సమరశంఖం పూరించాలని తెలుగుదేశం పార్టీ నేతలకు ఆదేశించింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆయన నివాసంలో శనివారం రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, జగన్ రెడ్డి అవినీతి తారాస్థాయికి చేరిందని ఈ సందర్బంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఎండగట్టాలని నిర్ణయించడం జరిగింది. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి రాక్షస పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ గురజాల మాల్యాద్రి, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి రావు, తెలుగుదేశం మానవ వనరుల విభాగం కోఆర్డినేటర్ బి.రామాంజనేయులు, తోపూరి గంగాధర్, అంకయ్య చౌదరి, ఎన్.విజయ్ కుమార్, వీర వెంకట గురుమూర్తి, గాజుల ఆదెన్న, బి, పాలడుగు వినీల, అనలిస్ట్ లు గుమ్మడి ప్రభాకర్, వున్నం.నాగరాజు, పి.సంతోష్ తదితరులు ఈ సమావేశంలో చర్చించారు.