ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID) అధికారులు త‌న‌ను అరెస్టు చేయడంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) స్పందించారు. తాను ఏం చేశానో చెప్పకుండా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా.. తాను చేసిన నేరం ఏమిటో నిరూపించకుండా అరెస్టు(arrest) చేశారని, అది చాలా తప్పు అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID) అధికారులు త‌న‌ను అరెస్టు చేయడంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(chandrababu) స్పందించారు. తాను ఏం చేశానో చెప్పకుండా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా.. తాను చేసిన నేరం ఏమిటో నిరూపించకుండా అరెస్టు(arrest) చేశారని, అది చాలా తప్పు అని అన్నారు. ఏదిఏమైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని ఆయన అన్నారు. అర్ధరాత్రి వచ్చి అందరినీ భయబ్రాంతులను చేసి తనను అరెస్టు చేశారని అన్నారు. తానేమైనా టెర్రరిస్టునా అని చంద్రబాబు ప్రశ్నించారు.

అధికారం ఉందని.. ఏమైనా చేసుకుంటామనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అడ్డుకోవడానికి, ప్రజలను భయబ్రాంతులను చేయడానికి తనను అరెస్టు చేశారని అన్నారు. సామాన్యుడికి కూడా ప్రాథమిక హక్కులుంటాయని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుందని.. కానీ ఏమీ చెప్పలేదని, చాలా బాధేస్తోందని అన్నారు. ఏం చేశానో చెప్పకుండా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కులను భంగపరచడమేనని ఆయన అన్నారు.

Updated On 9 Sep 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story