ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయంలేదు. దీంతో అధికారం చేపట్టేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇదే సమయంలో జంప్‌ జిలానీలు కూడా ఎక్కువే అయ్యారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దూకేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఉంది. దాదాపుగా అన్ని స్థానాల్లో ఎవరిని పోటీ చేయించాలో వైసీపీకి స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. దీంతో వైసీపీలో టికెట్‌ దక్కదన్న సమాచారంతో ఇతర పార్టీలకు నేతలు జంప్‌ అవుతున్నారు.

మరోవైపు టీడీపీలో(TDP) కూడా అసమ్మతిరాగాలు బయటపడుతున్నాయి. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు(Chandrababu) వెన్నంటి ఉండి నడిచిన నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్లు రావేమోనన్న ఆందోళన అయితే నెలకొని ఉంది. అధికారం రావడానికి ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకునే చంద్రబాబు మరోసారి ఇలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అనునిత్యం వెన్నంటి ఉండే దేవినేని ఉమకు(Devineni Uma) సైతం టికెట్‌ నిరాకరించినట్లు సమాచారం. ఆయనతో పాటు పెనమలూరు నేత బోడె ప్రసాద్‌కు కూడా టికెట్ రానట్లేనని అంటున్నారు. ఈ మధ్యనే టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం టికెట్‌ కన్ఫాం చేసినట్లు సమాచారం. అయితే మైలవరం ఇంచార్జిగా ఉన్న దేవినినే ఉమను పెనమలూరు పంపించాలని తొలుత చంద్రబాబు భావించారు. పెనమలూరు టికెట్‌పై దేవినేని ఉమ, బోడె ప్రసాద్, ఎం.ఎస్.బేగ్‌ పేర్లను పరిశీలిస్తూ ఓ సర్వే నిర్వహించారని తెలుస్తోంది.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ పెనమలూరు టికెట్‌ను తుమ్మల చంద్రశేఖర్‌కు కేటాయించే అవకాశం ఉందని ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. వైసీపీలో కమ్మ కార్పొరేషన్‌ చేర్మన్‌గా ఉన్న తుమ్మల చంద్రశేఖర్ పెనమలూరు టికెట్‌ హామీతోనే టీడీపీలో చేరారని అందుకే ఆయనకు టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే అటు మైలవరం లేదా పెనమలూరుపై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమ, బోడె ప్రసాద్‌కు హ్యాండ్ ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. గతంలో వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమ పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు అదే వసంత కృష్ణప్రసాద్‌ను తీసుకొచ్చి మైలవరం టికెట్‌ ఇస్తే ఉమ.. టీడీపీ డైరెక్షన్‌లో పనిచేస్తారా లేదా భవిష్యత్‌పై ఏదైనా నిర్ణయం తీసుకుంటారానన్న చర్చ అయితే నడుస్తోంది. చంద్రబాబుకు అనుంగ అనుచరుడిగా ఉన్న కేశినేని నాని కూడా వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనడానికి ఈ జంప్ జిలానీల కహానీలే ఉదాహరణగా చెప్పొచ్చు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టికెట్‌ రాకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అన్న మిమాంసలో అయితే ఉమ ఉన్నారని అంటున్నారు.

Updated On 4 March 2024 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story