మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ(TDP) అధినాయకుడు నారా చంద్రబాబునాయుడుది(Nara Chandrababu) అజ్ఞానమో, అహంకారమో తెలియదు కానీ చాలా సందర్భాలలో ఆయన తన పెత్తందారి మనస్తత్వాన్ని కనబరిచారు. అవతలివారిపై అవహేళగా మాట్లాడటం ఆయనకు చేతనైన విద్య. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవాడినని, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదు.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ(TDP) అధినాయకుడు నారా చంద్రబాబునాయుడుది(Nara Chandrababu) అజ్ఞానమో, అహంకారమో తెలియదు కానీ చాలా సందర్భాలలో ఆయన తన పెత్తందారి మనస్తత్వాన్ని కనబరిచారు. అవతలివారిపై అవహేళగా మాట్లాడటం ఆయనకు చేతనైన విద్య. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవాడినని, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదు. నిన్నటికి నిన్న శింగనమల(Shinganamala) నియోజకవర్గానికి వెళ్లి పెత్తందారి బుద్ధి చూపించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) సుదీర్ఘకాలంగా నిజాయితీగా పని చేస్తున్న ఓ సామాన్య కార్యకర్తకు టికెట్‌ ఇవ్వడాన్ని కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. శింగనమల నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న వీరాంజనేయులుకి(Veeranjaneyulu) టికెట్ ఇవ్వడాన్ని ఎగతాళి చేశారు చంద్రబాబు. టిప్పర్‌ డ్రైవర్‌(Driver) అంటూ హేళనగా మాట్లాడారు. ఎడమచేత్తో వేలి ముద్ర వేసేవాడు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. నిరుపేద దళితుడిని పట్టుకుని చాలా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు. పైగా వెకిలి నవ్వు ఒకటి. ఆ మాటలు విన్నవారికి కంపరం కలగకుండా ఉండదు. అన్నట్టు వీరాంజనేయులు నిరక్షరాస్యుడేమీ కాదు. ఎంఎ చదువుకున్న ఉన్నత విద్యావంతుడు. పెత్తందార్లకు పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM jagan) చెప్పినట్టుగానే పేదవారిని అందలం ఎక్కించేందుకు పాటుపడుతున్నారు. చంద్రబాబు మాత్రం ఏరికోరి డబ్బున్నవారికి టికెట్లు ఇస్తున్నారు. పేదవారు పైకి రావడం చంద్రబాబుకు ఇష్టం లేదు కాబోలు. దళితులంటే చిన్నచూపు ఉండబట్టే కదా దళితుడిగా పుట్టాలని ఎవరనుకుంటారు? అని అన్నది. చంద్రబాబుకు బీసీలన్నా గౌరవం లేదు. వారిని కూడా చిన్నచూపు చూశారు. టిప్పర్‌ డ్రైవర్‌ అంటూ పదే పదే నొక్కి పలుకుతూ హేళన చేయడమేమిటి? అన్ని వృత్తుల్లాగే అది కూడా ఒకటి. వృత్తిని అవహేళన చేసే అధికారం ఎవరిచ్చినట్టు? టిప్పర్‌ను నడుపుతూ గౌరవంగా బతుకుతున్నారు వీరాంజనేయులు. చంద్రబాబు తన అహంకారాన్ని తగ్గించుకుంటే ఆయనకు మంచిది! జనాలకు కూడా మంచిది!

Updated On 29 March 2024 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story