ఎన్టీఆర్‌(NTR) స్థాపించిన తెలుగుదేశంపార్టీకి(TDP) ఇంతటి దయనీయమైన పరిస్థితి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేశాడని, కేంద్రంలో చక్రం తిప్పాడని ఓ వర్గం మీడియా కీర్తించే చంద్రబాబునాయుడుకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. చంద్రబాబు(Chandrababu) మెడలో జనసేన(Janasena) జెండాను ఊహించామా? ఎవరైనా సరే తన తర్వాతేనని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు జనసేనకు జై కొట్టాల్సిన అవసరం వచ్చింది.

ఎన్టీఆర్‌(NTR) స్థాపించిన తెలుగుదేశంపార్టీకి(TDP) ఇంతటి దయనీయమైన పరిస్థితి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేశాడని, కేంద్రంలో చక్రం తిప్పాడని ఓ వర్గం మీడియా కీర్తించే చంద్రబాబునాయుడుకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. చంద్రబాబు(Chandrababu) మెడలో జనసేన(Janasena) జెండాను ఊహించామా? ఎవరైనా సరే తన తర్వాతేనని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు జనసేనకు జై కొట్టాల్సిన అవసరం వచ్చింది. జనసేన జెండాను మెడలో వేసుకుని తిరగాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఆ అవసరమేమిటో అందరికీ తెలుసు! ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న కోరిక! చంద్రబాబు చేతిలోకి టీడీపీ వెళ్లిన తర్వాత 2019లో మినహా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒంటరిగా పోలేదు. మితపక్షాల ఓటు బ్యాంకుతో ప్రతీసారి గట్టెక్కుతున్న టీడీపీ ఈసారి కూడా ఆ వ్యూహాన్నే అమలు చేస్తోంది. ఇప్పటికే జనసేనతో అంటకాగుతున్న టీడీపీకి(TDP) బీజేపీ(BJP) కూడా చేతులు కలిపితే బాగుండనే కోరిక బలంగా ఉంది. బీజేపీకి మాత్రం టీడీపీతో కలవడం సుతరామూ ఇష్టం లేదు. ఆ విషయం తెలిసే జనసేనను దూరం చేసుకోవద్దని టీడీపీ భావిస్తోంది. అందుకు తాను రెండు మూడు మెట్లు కిందకు దిగినా తప్పులేదని చంద్రబాబు అనుకుంటున్నారు. మొన్నామధ్య నందమూరి బాలకృష్ణ కూడా ఇదే పని చేశాడు. జై జనసేన అంటూ నినదించారు. లోకేశ్‌ అయితే పవన్‌ కల్యాణ్‌ జిందాబాబ్‌, జనసేన జిందాబాద్‌ అంటూ కాస్త గట్టిగానే నినదించారు.

Updated On 30 Dec 2023 7:26 AM GMT
Ehatv

Ehatv

Next Story