Land Titling Act : బాబులాగే ఆయన మీడియా కూడా మాట మార్చేసింది!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) మాటలు మార్చడంలో ప్రపంచ మొనగాడన్న విషయం తెలిసిందే! ఈ భూమ్మీద ఇన్నేసి యూటర్నులు తీసుకున్న రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. ఆయన మాట మార్చిన ప్రతీసారి ఆయనకు బాకాలు ఊదే ఓ వర్గం మీడియా కూడా రంగులు మార్చేసుకుంటుంది. చంద్రబాబు కాంగ్రెస్‌కు జై కొడితే ఈ మీడియా అంతే జైజై కాంగ్రెస్(congress) అంటూ కథనాలు రాస్తుంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu) మాటలు మార్చడంలో ప్రపంచ మొనగాడన్న విషయం తెలిసిందే! ఈ భూమ్మీద ఇన్నేసి యూటర్నులు తీసుకున్న రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. ఆయన మాట మార్చిన ప్రతీసారి ఆయనకు బాకాలు ఊదే ఓ వర్గం మీడియా కూడా రంగులు మార్చేసుకుంటుంది. చంద్రబాబు కాంగ్రెస్‌కు జై కొడితే ఈ మీడియా అంతే జైజై కాంగ్రెస్(congress) అంటూ కథనాలు రాస్తుంది. చంద్రబాబు బీజేపీ పంచన చేరితే బీజేపీకి(BJP) భజన చేస్తుంటుంది. మొత్తంగా చంద్రబాబు ఏం చేస్తే ఆయన కుల మీడియా కూడా అదే చేస్తూ ఉంటుంది. చంద్రబాబులాగే ముందో మాట చెప్పడం, ఆ వెంటనే నాలుక మడతేయడం చేస్తుంటాయి పచ్చ పత్రికలు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై విషం చిమ్ముతూ అడ్డమైన రాతలు రాస్తున్న చంద్రబాబు భజన పేపర్లు అప్పుడు తెగ ప్రశంసించాయి. ఈనాడులో(Eenadu) అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం(Land titling act) వస్తే రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుందని రాసింది.
కాబట్టి ఇది చాలా మంచి చట్టమంటూ న ఈటీవీ వచ్చే అన్నదాత కార్యక్రమంలో కథనాన్ని ప్రసారం చేశారు. ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వాన్ని నిందించడానికి టీడీపీ దగ్గర ఎలాంటి సరుకు లేదు! అందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై పడ్డారు. ఇంకా అమలులోకే రాని ఆ చట్టంపై విషం చిమ్ముతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ విష ప్రచారం చేస్తున్నది. చట్టం వస్తే మీ భూములు మీవి కావంటూ అసత్య కథనాలను ప్రచురిస్తోంది. చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు లోకేశ్ అయితే ఓ అడుగు ముందుకేశారు. మీ భూములు జగన్ ప్రభుత్వం లాక్కుటుంది జాగ్రత్త అంటూ ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈటీవీ ప్రసారం చేసిన ఓ కథనాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు బయటపెట్టారు. వీడియో లింక్‌ను ప్రజలకు షేర్ చేస్తున్నారు. ఇది తెలిసి రామోజీరావు కంగారుపడ్డారు. నిమిషాల్లో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. కొద్దిరోజులుగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న పచ్చ మీడియా చంద్రబాబు గతంలో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన విషయాన్ని మాత్రం ఎక్కడా రాయడం లేదు. చంద్రబాబు కోసం ఈ మీడియా ఎంతకైనా దిగజారుతుందని మరోసారి రుజువయ్యింది.