Breaking News : చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) రాజమండ్రి సెంట్రల్ జైల్(Rajahmundry Central Jail) లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రిమాండ్‌ను కోర్టు ఎల్లుండి వరకూ పొడిగించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) రాజమండ్రి సెంట్రల్ జైల్(Rajahmundry Central Jail) లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రిమాండ్‌ను కోర్టు ఎల్లుండి వరకూ పొడిగించింది. ఈనెల 24 వరకూ చంద్రబాబు రిమాండ్‌ను(Remand) పొడిగిస్తూ కోర్టు(Court) ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో.. సీఐడీ అధికారులు ఆయయను వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
సీఐడీ కస్టడీపై(CID Custody) చంద్రబాబు అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు(ACB Court) జడ్జి అడిగారు. ఇందుకు చంద్రబాబు బదులిస్తూ.. నన్ను అకారణంగా జైల్లో పెట్టారని.. నా బాధ, ఆవేదనంతా అదేనని పేర్కొన్నారు. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసునని చంద్రబాబు బదులిచ్చారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్న జడ్జి.. చట్టం అందరికీ సమానమేనన్నారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి.. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయని అన్నారు. రిమాండ్ ను శిక్షగా భావించొద్దు.. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అని జడ్జి పేర్కోన్నారు.