Chandrababu : గెలుపు గుర్రాల కోసం వేట..చంద్రబాబు సరికొత్త స్ట్రాటెజీ !
ఏపీలో ఎన్నికలకు(AP Elections) మరో మూడు నెలల సమయం ఉంది. కానీ అప్పుడే పొలిటికల్ హీట్(Politics) పెరిగిపోయింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార, విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైసీపీ(YCP) అధినేత, సీఎం జగన్(CM Jagan)..తన స్ట్రాటజీని మార్చేశారు. ప్రతిపక్షాలకు అంతు చిక్కని సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు. సాధారణంగానే ఎవరూ ఊహించని పేర్లను ఎన్నికల బరిలోకి దింపడం జగన్ స్ట్రాటజీ. మరోవైపు ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు.. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అదే స్ట్రాటజీని ప్లాన్ చేస్తున్నారట.

2019 ఎన్నికల్లో ఓడిపోయి..ఐదేళ్లుగా అధికారానికి దూరమైంది టీడీపీ(TDP). ఇటు పార్టీకి..అటు అభ్యర్థులకు పెద్దగా ఆదాయం లేదు. మరి.. ఈసారి ఎంపీగా గెలవాలంటే కోట్లు ఖర్చు చేయాలి. అలాంటి బలమైన అభ్యర్థుల కోసం చంద్రబాబు(Chandrababu) వేట మొదలు పెట్టారట. మరి..బలమైన అభ్యర్థులంటే.. బయట నుంచే తేవాలి. బయట నుంచి అంటే..రాజకీయ పార్టీల నుంచి కాదు..రాజకీయ అవసరాలు ఉన్న పరిశ్రామిక, వ్యాపార రంగాల్లోని ఉత్సాహవంతులను నుంచి అన్నమాట. సరిగ్గా.. చంద్రబాబు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల తెలంగాణలో(Telangana) అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(congress party) అనుసరించిన ఫార్మూలా కూడా ఒక ఇన్సిపిరేషనట. తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్..ఆర్థికంగా(Financial) బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలతోపాటు పారిశ్రామిక రంగానికి చెందిన పలువురికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయా ఎంపీ స్థానాల్లో ఏవేవో పేర్లు వినిపిస్తున్నప్పటకీ..అది కేవలం పైపైన వినిపించే ప్రచారం మాత్రమేనట. ఈసారి మూడొంతుల సీట్లలో ఆర్థికంగా ఉన్న బలమైన అభ్యర్థులతో రిప్లేస్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
దీనివల్ల రాబోయే ఎన్నికల్లో బలమైన వైసీపీ అభ్యర్థులను ఢీకొనడంతోపాటు ఆయా లోక్సభ(Lok Sabha) స్థానాల్లోని ఎమ్మెల్యేలకు ఆర్థికంగా ఆసరా దొరుకుతుందనేది చంద్రబాబు ఆలోచనట. అందుకే ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామిక లేదా వ్యాపార వేత్తలపై దృష్టిపెట్టారని సమాచారం. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న యువ ఎన్ఆర్ఐలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారట.