Chandrababu Oath Ceremony : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu) నాయుడు జూన్ 9న ప్రమాణ స్వీకారం(Oath ceremony) చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 158 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి అఖండ విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కొత్త ముఖ్యమంత్రిగా టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు(Nara Chandrababu) నాయుడు జూన్ 9న ప్రమాణ స్వీకారం(Oath ceremony) చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 158 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి అఖండ విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. 74 ఏళ్ల చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
2014లో విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ అధినేత మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో పరాజయాన్ని చవిచూసిన చంద్రబాబు.. ఐదేళ్ల తర్వాత అధికార మళ్లీ పుంజుకున్నారు. నటుడు పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ (JSP), భారతీయ జనతా పార్టీ (BJP)తో చంద్రబాబు పొత్తు గేమ్ ఛేంజర్ గా మారినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
131 సెగ్మెంట్లలో స్పష్టమైన ఆధిక్యంతో టీడీపీ సొంతంగా భారీ మెజారిటీ సాధించింది. 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి మరోమారు ఆయన గెలవబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్‌లో లోకేష్ ఓటమి చవిచూశారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ చంద్రాబు నేతృత్వంలోని టీడీపీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. త్రైపాక్షిక కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2019లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలిగింది.