Chandrababu : బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) మంచి వ్యూహకర్త అని, అపర చాణక్యుడని సందర్భం ఉన్నా లేకున్నా అనుకూల మీడియా భుజకీర్తులను తొడుగుతూ వస్తున్నది. ఆ మాయలో పడి జనం కూడా చంద్రబాబు గొప్పడనే అనుకున్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ఒక్క వ్యూహం ఫలించలేదు. మొదటిసారి బీజేపీతో(BJP) పొత్తు పెట్టుకున్నప్పుడు లక్కీగా అధికారంలోకి వచ్చారంతే! అప్పుడు మాత్రం దేశమంతటా వాజపేయి మీద సానుభూతి పవనం వీస్తున్నదని, కార్గిల్ యుద్ధం కలిసి వస్తున్నదని చంద్రబాబు పసిగట్టగలిగారు.
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) మంచి వ్యూహకర్త అని, అపర చాణక్యుడని సందర్భం ఉన్నా లేకున్నా అనుకూల మీడియా భుజకీర్తులను తొడుగుతూ వస్తున్నది. ఆ మాయలో పడి జనం కూడా చంద్రబాబు గొప్పడనే అనుకున్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ఒక్క వ్యూహం ఫలించలేదు. మొదటిసారి బీజేపీతో(BJP) పొత్తు పెట్టుకున్నప్పుడు లక్కీగా అధికారంలోకి వచ్చారంతే! అప్పుడు మాత్రం దేశమంతటా వాజపేయి మీద సానుభూతి పవనం వీస్తున్నదని, కార్గిల్ యుద్ధం కలిసి వస్తున్నదని చంద్రబాబు పసిగట్టగలిగారు. మళ్లీ ఇప్పుడు నరేంద్రమోదీ హవా కొనసాగుతున్నదని తెలుసుకుని బీజేపీతో పొత్తు కోసం నానా తంటాలు పడ్డారు. తర్వాత ఆయన కుదుర్చుకున్న ఏ పొత్తు కూడా సక్సెస్ కాలేదు. మళ్లీ 2014లో బాబుకు కాలంతో పాటు పొత్తు కూడా కలిసి వచ్చింది. చంద్రబాబుకైనా, పవన్‌కల్యాణ్‌కైనా కావాల్సింది రాష్ట్రాభివృద్ధి కాదు. జగన్ ప్రభుత్వం కూలిపోవడమే కావాలి. జగన్(CM Jagan) వ్యతిరేక ఓటును చీలనివ్వను, జగన్ పతనాన్నిశాసిస్తాను అంటూ బీరాలు పలుకుతూ వచ్చిన పవన్ కూడా అది తన ఒక్కడి వల్ల కాని పని అని తెలుసుకుని పాచిపోయిన లడ్డూలిచ్చిన బీజేపీతో చెలిమి చేశాడు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు. ఈ విధంగా టీడీపీ-జనసేన(Janasena)-బీజేపీ ఓ కూటమిగా ఏర్పడ్డాయి. నిజానికి చంద్రబాబుతో పొత్తు ఏపీ బీజేపీ నేతలకు ఇష్టంలేదు. వారిలో చాలా సందేహాలు ఉన్నాయి. అందుకే కొందరు జెపీ నడ్డాకు(JP Nadda) లేఖ కూడా రాశారు. పొత్తుతో చంద్రబాబు తమ కొంప ముంచేట్టుగా ఉన్నారంటూ బీజేపీ నేతల్లో కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నరేంద్రమోదీని ఎన్నికల ప్రచారానికి బాగా ఉపయోగించుకుంటూ తమను మాత్రం నిలువునా ముంచేస్తారనే భయం బీజేపీ నాయకులలో ఉంది. బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని అంటున్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గెలవని, పార్టీ ఎంతో బలహీనంగా ఉన్న అసెంబ్లీ సీట్లను బీజేపీకి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థులుగా ఎంపికవుతున్నవారంతా చంద్రబాబు మనుషులేనన్న శంక ఉండేనే ఉంది. తన మనుషుల్ని ఓ ప్రణాళిక ప్రకారం బీజేపీలోకి పంపించి, ఇప్పుడు వారికే టికెట్లు వచ్చేలా చంద్రబాబు చేస్తున్నారని కొందరు అనుమానపడుతున్నారు. వీరంతా జేపీ నడ్డాకు ఓ సుదీర్ఘమైన లేఖ కూడా రాశారు.