పవన్‌ మాటను తెలుగుదేశం పార్టీనే(TDP) నమ్మడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(CM Chandrababu) మరో పదేళ్ల పాటు ఆ పదవిలోనే ఉండాలన్నది జనసేన(Janasena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawankalyan) కోరిక! ఆ కోరికను మనసులోనే దాచిపెట్టుకోకుండా అసెంబ్లీలో అందరి ముందూ చెప్పారు. అయితే పవన్‌ మాటను తెలుగుదేశం పార్టీనే(TDP) నమ్మడం లేదు. ఎప్పటికైనా ఆయనతోనే టీడీపీకి ముప్పు వాటిల్లవచ్చనే భయం అయితే ఉంది. సోమవారం పవన్ కల్యాణ్‌ ఢిల్లీకి(Delhi) వెళుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనపై టీడీపీకి బోల్డన్ని అనుమానాలు కలుగుతున్నాయి. మొన్న మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Elections) ప్రచారంలో పాల్గొన్న పవన్‌ ఆ మధ్యన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను(Amit shah) కూడా కలుసుకున్నారు. బీజేపీ అధినాయకత్వం పవన్‌తో ఏదో పథకాన్ని రచిస్తున్నదని టీడీపీ సందేహపడుతున్నది. పదేళ్లపాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్‌ అనడం వెనుక కూడా ఏదో వ్యూహం దాగి ఉందని టీడీపీ క్యాడర్‌ భావిస్తోంది. పవన్‌తో బీజేపీనే ఆ మాట అనిపిస్తున్నదని కొందరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు మనసులో లోకేశ్‌ను(Nara Lokesh) ముఖ్యమంత్రి చేయాలని ఉందని బీజేపీ అనుకుంటోంది. అందుకే పవన్‌తో చంద్రబాబు పదేళ్ల సీఎం అని చెప్పించారని అంటున్నారు. చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్‌ కల్యాణ్‌కు సీఎం పదవిని ఆఫర్‌ చేయరు. బీజేపీ ప్లానేమిటంటే సీఎం సీటులో పవన్‌ను కూర్చోబెట్టి, టీడీపీకి చెక్‌ పెట్టాలన్నది. అందుకే పవన్‌ కల్యాణ్‌ను జాతీయ నాయకుడిగా(National leader) ప్రొజెక్ట్ చేస్తున్నది. ఎప్పటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. పవన్‌ను మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక ప్రచారంలో పంపింది కూడా అందుకేనట! పవన్‌ కల్యాణ్‌ను జనసేన నాయకుడిగా బీజేపీ చూడటం లేదు. తమ పార్టీ సభ్యుడిగానే పరిగణిస్తున్నది. మొత్తంగా పవన్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ ఏదో మాస్టర్‌ ప్లానే వేస్తున్నదని అర్థమవుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో!

Eha Tv

Eha Tv

Next Story