కూటమి ప్రభుత్వంపై బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వంపై బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి ఇన్నిరోజులైనా తనకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన చెందారు. ఎంపీ చిన్ని బర్త్‌డే వేడుకల్లో బుద్దావెంకన్న ఈ వ్యాఖ్యలు చేశారు. పోరాటం చేసినవారికి ఏ పదవులు ఇవ్వడం లేదని బుద్దా వెంకన్న అన్నారు. తన ఆవేదనను ఎంపీ చిన్ని(MP Chinni) అధిష్టానం తీసుకెళ్లాలని బుద్దా వెంకన్న అన్నారు. తనకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకి మరోలా మాట్లాడడం చేతకాదన్నారు. ఎమ్మెల్యేలు రికమెండ్‌ చేసిన వారికే సీఐ పోస్టింగులు(CI Post) ఇచ్చారు. ప్రజలకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యేగా ఉండాలన్నారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశాను. నాపై 37 కేసులు పెట్టారని, నా మాట సాగడం లేదని ఆవేదన చెందారు. 37 కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్లు అడుగుతున్నారు, నేనే ఇవ్వలేకపోతున్నానని అన్నారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుంటానని అన్నారు. నాకు పోరాటమనేది కొత్త కాదని, పోరాటంతోనే ఎమ్మెల్యే అవుతానని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎంత మంది పోరాడారని ఆయన ప్రశ్నించారు. అధిష్టానం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని బుద్దా వెంకన్న ఎంపీ చిన్నిని కోరారు. అయితే దీనిపై చిన్ని స్పందిస్తూ పొత్తు ధర్మం వల్ల టీడీపీ నేతలకు కొంత నష్టం జరిగిందని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయిస్తానని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా మాట్లాడగలిగే సత్తా బుద్దా వెంకన్నకు ఉందని, కానీ ఆయన నాపై బాధ్యత పెట్టినందున తప్పకుండా చంద్రబాబు దృష్టికి సమస్యలు తీసుకెళ్తానని ఎంపీ కేశినేని నాని హామీ ఇచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story