Kinjarapu Atchannaidu : అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు
అసెంబ్లీని(Assembly) వైసీపీ కార్యాలయంగా(YCP Office) మార్చేశారని ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై(Thamineni Sitharamam) విమర్శలు గుప్పించారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని కూడా చదవలేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు.
అసెంబ్లీని(Assembly) వైసీపీ కార్యాలయంగా(YCP Office) మార్చేశారని ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై(Thamineni Sitharamam) విమర్శలు గుప్పించారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని కూడా చదవలేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. మమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టినపుడే ఆయనపై గౌరవం పోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ మన సభ్యులంటూ సంబోధించారని వెల్లడించారు. స్పీకర్ వైఖరి, అధికారపక్షం తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వివరించారు. ఇదిలావుంటే.. టీడీపీ శాసన సభ్యులు అచ్చెన్నాయుడు, అశోక్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో వీడియో తీసినందుకు వారిద్దర్నీ సభా సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు పైవ్యాఖ్యలు చేశారు.