పెన్షన్(Pension) ను రూ.3 వేల‌కు పెంచుతూ ఏపీ కేబినెట్(AP Cabinet) నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై టీడీపీ(TDP) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) మాట్లాడుతూ.. అధికార వైసీపీపై(YCP) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా పెన్షన్ రూ.3 వేలు చేస్తున్నామంటూ.. కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అని విమ‌ర్శించారు.

పెన్షన్(Pension) ను రూ.3 వేల‌కు పెంచుతూ ఏపీ కేబినెట్(AP Cabinet) నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై టీడీపీ(TDP) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) మాట్లాడుతూ.. అధికార వైసీపీపై(YCP) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా పెన్షన్ రూ.3 వేలు చేస్తున్నామంటూ.. కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అని విమ‌ర్శించారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 చొప్పున పెంపు అంటూ హామీపై మడమ తిప్పారని అన్నారు. ఆ మాట ప్రకారం పెంచినా.. 2022 నాటికే రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని దుయ్య‌బ‌ట్టారు.

రూ.3 వేల పెన్ష‌న్‌ హామీపై మడమ తిప్పి ఒక్కో పెన్షన్ దారుడికి జగన్ రెడ్డి(CM Jagan) దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టాడని అన్నారు. ఇదేనా పేదలపై చిత్తశుద్ధి? ఇదేనా పెన్షన్ దారులపై శ్రద్ధ? అంటూ నిలదీశారు. పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే.. మొదటి ఏడాది నుంచే రూ.3 వేల చొప్పున పెన్షన్ అందేదన్నారు. ప్రజల్ని ఎల్లకాలం మాటలతో మాయం చేయడం సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాల‌న్నారు.

Updated On 15 Dec 2023 7:50 AM GMT
Ehatv

Ehatv

Next Story