ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీల కూటమి తొలి జాబితా ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన పోటీ చేసేది 24 స్థానాలలోనే! మూడు లోక్‌సభ స్థానాల(Lok sabha) నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారట! మొదటి జాబితాలో టీడీపీ 94 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. ఇలా తొలి జాబితా బయటకు వచ్చిందో లేదో అసంతృప్త జ్వాలలు భగ్గమంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీల కూటమి తొలి జాబితా ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన పోటీ చేసేది 24 స్థానాలలోనే! మూడు లోక్‌సభ స్థానాల(Lok sabha) నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారట! మొదటి జాబితాలో టీడీపీ 94 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. ఇలా తొలి జాబితా బయటకు వచ్చిందో లేదో అసంతృప్త జ్వాలలు భగ్గమంటున్నాయి. ఉమ్మడి కడప(Kadapa) జిల్లాలో కడప అసెంబ్లీ టికెట్‌ మాధవరెడ్డికి(Madhava reddy) ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇక్కడ టికెట్‌పై అమీర్‌బాబు, ఉమాదేవిలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా మాధవరెడ్డి వర్గంతో వీరిద్దరు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. వీరు మాధవరెడ్డికి సహకరిస్తారో లేదో చూడాలి. అలాగే రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ మండిపల్లి రామప్రసాద్‌రెడ్డికి(Ramaprasad Reddy) ఇచ్చారు. దాంతో మాజీ ఎమ్మెల్యేలు రమేశ్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి కినుకబూనినట్టు సమాచారం. రమేశ్‌రెడ్డి అయితే రాజీనామాకు సిద్ధపడ్డారని తెలిసింది. కమలాపురంలో ఇన్‌ఛార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి టికెట్‌ను ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. నరసింహారెడ్డికి టికెట్‌ ఇస్తే వీరశివారెడ్డి నొచ్చుకుంటారేమోనన్న భయంతోనే చంద్రబాబు ప్రకటన చేయలేదు. జమ్మలమడుగు నుంచి భూపేష్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి బరిలో దిగుతున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే మాత్రం ఈ సీటును ఆది నారాయణరెడ్డికి వదిలేయాల్సి వస్తుంది. ఈ కారణంగానే జమ్మలమడుగు ప్రకటన ఆగిపోయింది. అనంతపురం జిల్లాలోని పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథికి చంద్రబాబునాయుడు చేయి ఇచ్చారు. పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సబితను ప్రకటించడంతో బీకే వర్గం అసంతృప్తితో ఉంది. శింగనమల టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి నియామకంపై టీడీపీ క్యాడర్‌ కోపంతో ఉంది. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు అనౌన్స్‌ చేయడంతో స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated On 24 Feb 2024 3:08 AM GMT
Ehatv

Ehatv

Next Story