TDP Silent On Adani Scam : అదానీ స్కామ్‌పై కూటమి నేతలు గప్‌చుప్!
తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా అదానీ(Adani) కుంభకోణంపై పేజీలకు పేజీలు రాస్తున్నది.
తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా అదానీ(Adani) కుంభకోణంపై పేజీలకు పేజీలు రాస్తున్నది. గంటలకు గంటలు ప్రసారం చేస్తున్నది. ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు గాను ప్రభుత్వ అధినేతకు 1,750 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు(America investigation agency) బయటపెట్టాయి. ఈ లంచం నేరుగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికే(YS Jagan) చేరిందన్నది టీడీపీ అనుకూల మీడియా చెబుతున్నది. అబ్బే ఈ ఆరోపణలలో కొంచెం కూడా నిజం లేదని అటు అదానీ, ఇటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నది. 1,750 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. మామూలుగా అయితే 30, 40 కోట్ల రూపాయల స్కామ్ అంటేనే గొంతులు చించేసుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయినదానికి కానిదానికి గత ప్రభుత్వంపై నిందలు వస్తున్న చంద్రబాబు- పవన్ ద్వయం దీన్ని ఎందుకు మాట్లాడటం లేదు? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జడిసి మౌనంగా ఉంటున్నారా? అదానీ అక్రమాలతో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శల కారణంగా సైలెంట్‌గా ఉంటున్నారా? అసలు ఈ పాటికి జగన్‌పై శివాలెత్తిపోయేవారు. జగన్‌కు జైలు శిక్ష సరిపోదని, ఉరిశిక్ష వేయాలని ప్రకటనలు చేసేవారు! ఈ మౌనానికి కారణమేమిటో తెలియడం లేదు!