Janasena : తిరుపతి టికెట్‌పై పంతంపడుతున్న జనసేన! నానుస్తున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎన్నికల వ్యూహరచనలో బిజీగా ఉంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూటమిగా ఏర్పడిన తెలగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీలలోనే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల షేరింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎన్నికల వ్యూహరచనలో బిజీగా ఉంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూటమిగా ఏర్పడిన తెలగుదేశం(TDP)-జనసేన(Janasena) పార్టీలలోనే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల షేరింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఏ పార్టీ ఎక్కడ్నుంచి పోటీ చేయాలనేదానిపై చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతకు ముందైతే జనసేనకు పదో, పదిహేను స్థానాలు కేటాయిస్తే సరిపోయేది. జనసేన పార్టీ కూడా ఇందుకు రాజీపడిపోయేది. ఇప్పుడా పరిస్థితి లేదు. జనసేన కూడా నెమ్మదిగా బలపడుతోంది. ఒకప్పుడంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వెతుక్కోవాల్సి వచ్చింది.
పార్టీలో వలసలు పెరుగుతుండటంతో ఆటోమాటిక్‌గా టికెట్ కోసం పోటీ కూడా పెరుగుతోంది. జనసేనలో చేరితే టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే చాలా మంది ఆ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాలపై రెండు పార్టీలలో గట్టి పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల కోసం రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. తమకు కావాలంటే తమకు కావాలని పంతంపడుతున్నాయి. ఇలాంటి నియోజకవర్గాలలో తిరుపతి కూడా ఒకటి. ఇక్కడ బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. వారే గెలుపోటములను ప్రభావితం చేయగలరు. జనసేన పార్టీని వారు ఓన్ చేసుకున్నారు. మరి పొత్తులో భాగంగా తిరుపతిని జనసేనకు టీడీపీ వదిలిపెట్టగలదా? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను భూమన అభినయ్(Bhumana Abhinay)కు ఇచ్చేసింది.
ఇప్పుడు తేలవలసింది టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి పేరే! 2008 మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ(Praja Rajyam Party) పెట్టిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన పాలకొల్లుతో పాటు తిరుపతి(Tirupati) నుంచి కూడా పోటీ చేశారు. పాలకొల్లు చిరంజీవికి హ్యాండిచ్చింది కానీ తిరుపతి ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఇది ఉదాహరణగా చూపించి జనసేన తిరుపతిని డిమాండ్ చేస్తోంది. బలిజలు ఎక్కువగా ఉన్న తిరుపతిలో తాము నిలబడితే విజయం సునాయాసంగా వస్తుందని జనసేన అంటోంది. తాము ఇక్కడ్నుంచి పోటీ చేయకపోతే గెలుపు మీద నమ్మకం లేదనే అపవాదు వస్తుందని జనసేన వాదిస్తోంది. అప్పుడు బలిజ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని చెబుతోంది. జనసేనకు తిరుపతి కేటాయించకపోతే రాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టొచ్చని పవన్ ఫ్యాన్స్ ఆల్‌రెడీ డిసైడయ్యారు. జనసేన నుంచి ఎవరిని నిలబెట్టినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. జనసేనను కాదని టీడీపీనే పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా ఓడించి తీరతామని హెచ్చరిస్తున్నారు.