Tadiparthi CI Suicide : పోలీసు శాఖలో విషాదం.. తాడిపత్రి సీఐ ఆత్మహత్య
పోలీసు శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. తాడిపత్రి పట్టణ సీఐ ఆవుల ఆనందరావు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆనందరావు 1996 బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో ఆవుల ఆనందరావు ఉమ్మడి కడప జిల్లాలో ఎస్సైగా, సీఐ గా విధులు నిర్వర్తించారు.

Tadipatri CI Ananda Rao committed suicide
పోలీసు శాఖ(Police Department)లో విషాద ఛాయలు అలముకున్నాయి. తాడిపత్రి పట్టణ సీఐ ఆవుల ఆనందరావు(Tadiparthi CI Avula Ananda Rao) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డారు. ఆనందరావు 1996 బ్యాచ్ కు చెందిన అధికారి. గతంలో ఆవుల ఆనందరావు ఉమ్మడి కడప జిల్లా(Kadapa District)లో ఎస్సైగా, సీఐ గా విధులు నిర్వర్తించారు. ఏఆర్ ఎస్సై కుమార్తెను ఆనందరావు వివాహమాడారు. సీఐ ఆనందరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విధి నిర్వహణలో ఆనందరావు.. పైఅధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. సీఐ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(MLA Kethireddy Peddareddy) పరామర్శించారు. ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.
