డీజీపీకి స్వరూపానందేంద్రస్వామి లేఖ!

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్‌ కేటగిరి భద్రతను(X catogery Security) వెనక్కి తీసుకోవాలంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి(Swaroopanandendra Swamy) డీజీపీని(DGP) కోరారు. ఈ మేరకు ఆయనకో లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం తనకు పోలీసు రక్షణ అందించాయని, తన భద్రత, శ్రేయస్సును కాంక్షించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, కూటమి ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక నుంచి తాను రిషికేశ్‌లో ఉంటానని, ఎక్కువ సమయాన్ని తపస్సుకు కేటాయిస్తానని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఈ కారణంగా తనకు కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కి తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన భూములను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే 2005లో టీటీడీ బోర్డు శారదాపీఠానికి తిరుమలలోని గోగర్భం డ్యామ్‌ వద్ద భూమి కేటాయించింది. 2020లో టీటీడీ దాన్ని రెగ్యులరైజ్‌ చేసింది. అక్కడ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకున్నది.


Updated On 26 Nov 2024 10:33 AM GMT
Eha Tv

Eha Tv

Next Story