ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యేలపై సంచలన సర్వే చేపట్టారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh )లో టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Jana Sena-BJP) కూటమి ఎమ్మెల్యేలపై సంచలన సర్వే చేపట్టారు. ఓప్ర‌ముఖ స‌ర్వే సంస్థ ఐఐటీ (IIT)నిపుణుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వే చేయించింది. ఈ స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. 11 నెల‌ల పాల‌న పూర్తి చేసుకుంటున్న కూట‌మి(alliance)లోని ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయగా ఏకంగా 70 శాతం ఎమ్మెల్యేలు వ్య‌తిరేక‌తను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రియల్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, మద్యం మాఫియాకు మద్దతు ఇవ్వడమే వారి పట్ల వ్యతిరేకత వస్తోందని సర్వేలే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియ‌ల్ ఎస్టేట్‌, ల్యాండ్ మాఫీయా అవ‌తారం ఎత్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో పలు కంపెనీలు, వ్య‌క్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డ‌బ్బు పోగేసుకుంటున్నారు. మైనింగ్ మాఫియా, కాంట్రాక్ట‌ర్ల నుంచి ముక్కు పిండి మ‌రీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు వచ్చాయి. ఇందులో 71 మంది ఎమ్మెల్యేలకే 30 శాతం కొంత పాజిటివిటీ ఉందని, మిగిలినవారికి 30 శాతం లోపే ప్రజాదరణ ఉందని సర్వే చెప్తోంది.

అనంత‌పురం జిల్లాలో మ‌డ‌క‌సిర (SC), పెనుగొండ‌, క‌దిరి, గుంత‌క‌ల్‌, అనంత‌పురం అర్బ‌న్‌, సింగ‌న‌మ‌ల (SC), క‌ల్యాణ‌దుర్గం..

చిత్తూరు జిల్లాలో శ్రీ‌కాళ‌హ‌స్తి, తిరుప‌తి, చంద్ర‌గిరి, న‌గరి, గంగాధ‌ర‌నెల్లూరు (SC), స‌త్య‌వేడు (SC) నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు 70 శాతం వ్యతిరేకత మూటకట్టుకున్నారు.

శ్రీ‌కాకుళం జిల్లాలో శ్రీ‌కాకుళం, ఎచ్చెర్ల‌, పాల‌కొండ (ST), ప‌లాస‌, పాత‌ప‌ట్నం.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌జ‌ప‌తిన‌గ‌రం, నెల్లిమ‌ర్ల‌, సాలూరు (ST), పార్వ‌తీపురం (SC), కురుపాం (ఎస్టీ)..

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో య‌ల‌మంచిలి, పెందుర్తి , విశాఖ‌ప‌ట్నం (South), న‌ర్సీప‌ట్నం, అన‌కాప‌ల్లి; ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో తుని, రాజాన‌గ‌రం, పి.గ‌న్న‌వ‌రం (SC), కాకినాడ రూర‌ల్ , రంప‌చోడ‌వ‌రం (ఎస్టీ), రాజోలు (ఎస్సీ), కొత్త‌పేట‌, రామ‌చంద్రాపురం;

వెస్ట్ గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెం, న‌ర‌సాపురం, ఉంగ‌టూరు, నిడ‌ద‌వోలు, పోల‌వ‌రం (ST), చింత‌ల‌పూడి (SC); కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ వెస్ట్‌, తిరువూరు (SC), కైక‌లూరు, నూజివీడు, నందిగామ (SC)

గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు, న‌ర్సారావుపేట‌, గుంటూరు వెస్ట్ , తెనాలి, బాప‌ట్ల‌, గుర‌జాల‌

ప్ర‌కాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల‌, గిద్ద‌లూరు; నెల్లూరు జిల్లాలో కావ‌లి, స‌ర్వేప‌ల్లి, సూళ్లూరుపేట (SC), ఉద‌య‌గిరి..

వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో క‌డ‌ప‌, రాయ‌చోటి, కోడూరు (SC)..

క‌ర్నూలు జిల్లాలో ప‌త్తికొండ‌, ఆళ్ల‌గ‌డ్డ‌, పాణ్యం, ఆదోని, క‌ర్నూలు, డోన్‌, నందికొట్కూరు (SC) నియోజవర్గాల్లోనే 30 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 30 శాతం లోపే పాజటివ్‌ ఉందని సర్వే చెప్తోంది.

ehatv

ehatv

Next Story