C Voter Survey Report : అరెస్ట్‌తో చంద్రబాబుకు లబ్ధి ... సీ ఓటర్ సర్వే నివేదిక
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Arrest) అయిన విషయం తెలిసిందే! ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు అరెస్ట్‌పై సీ ఓటర్ ఓ సర్వే చేసింది. సీ ఓటర్ సర్వే నివేదికను ఐఎఎన్‌ఎస్(IASS) న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Arrest) అయిన విషయం తెలిసిందే! ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు అరెస్ట్‌పై సీ ఓటర్ ఓ సర్వే చేసింది. సీ ఓటర్ సర్వే నివేదికను ఐఎఎన్‌ఎస్(IASS) న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. ఇందులో సంచలన విషయాలను తెలిపంది. చంద్రబాబు అరెస్ట్‌తో తెలుగుదేశం పార్టీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని సీ ఓటర్ సర్వే చెబుతోంది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమనని ప్రజలు అనుకుంటున్నారట! చంద్రబాబు అరెస్ట్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో(Jagan Mohan Reddy) అభద్రతాభావం ఏర్పడిందట! అరెస్ట్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతుందట! అరెస్ట్ అంశం చంద్రబాబుకు లాభిస్తుందని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. అరెస్ట్ చంద్రబాబుకు లాభిస్తుందని టిడిపి మద్దతుదారుల్లో 85 శాతం మంది చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారుల్లో కేవలం 36 శాతం మందే చంద్రబాబు జైలుకు వెళ్లడం జగన్ కు లాభిస్తుందని తెలిపారు. 64 శాతం మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చంద్రబాబు అరెస్ట్ టిడిపికే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. అరెస్ట్ చంద్రబాబుకే మేలు చేస్తుందని బీజేపీకి చెందిన ప్రతి ఐదు మందిలో ముగ్గురు తెలిపారు.జనసేన పొత్తుతో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటోంది సీ ఓటర్ సర్వే. అన్నట్టు ఈ సర్వేలో పాల్గొన్నది కేవలం 1,809 మంది కావడం విశేషం.