తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి(Justice BR Gawai), జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌(Justice KV Viswanathan) ధర్మాసనం విచారించనుంది. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandra Babu) చేసిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి(BJP Leader Subramanyam), ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఎన్‌డీడీబీ ల్యాబ్‌(NDDB Lab) నివేదికపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపాలని సుబ్బారెడ్డి విన్నవించుకున్నారు. ఈ కేసులో సుబ్రమణ్యస్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. నాలుగు ట్యాంకర్లను వెనక్కిపంపించామని, తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడనే లేదని స్వయంగా టీటీడీ ఈవో శ్యామలరావు(TTD EO Syamala Rao) చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. ఆ నెయ్యినే వాడనప్పుడు లడ్డూ ఎలా అపవిత్రత అయ్యిందో తేల్చాలని కోరారు. అలాగే ల్యాబ్‌ రిపోర్ట్‌ వెనుక ఏమైనా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అన్నది కూడా తేలాల్సిన విషయమని పిటిషన్‌దారులు కోరారు. అవాస్తవాలతో, తప్పుడు ఆరోపణలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారని అన్నారు.

ehatv

ehatv

Next Story