YS Jagan Bail Cancellation Case :జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం. విచారణ పురోగతి ఏ దశలో ఉందని ప్రశ్నించిన ధర్మాసనం. సీబీఐ కోర్టు(CBI Court), హైకోర్టు(High Court), సుప్రీంకోర్టులలో జగన్మోహన్‌రెడ్డి(Ys Jagan) అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఏఏ కోర్టులలో ఏఏ కేసులు దాఖలయ్యాయి? వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వాలని ఆదేశించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత ఏం చేయాలో చెబుతామని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(RaghuramaKrishnaraju) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం!