Supreme cOurt Serious On CBN : వేంకటేశ్వస్వామితో పెట్టుకుని చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు!
భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu naidu) చేసినట్టు చేయరు.
భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవారు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu naidu) చేసినట్టు చేయరు. దేవుళ్లంటే భక్తి ఉన్నవారికి పాపభీతి ఉంటుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం ఉంటుంది. చంద్రబాబు దేవుడిని విశ్వసిస్తారో లేదో తెలియదు కానీ ఆయన పవిత్రమైన తిరుమల లడ్డూ(Tirumala Laddu) విషయంలో భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయకూడని తప్పు చేశారని ప్రజలు అనుకుంటున్నారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ(Ghee quality) జరిగిందనే, జంతువుల కొవ్వు(Animal fat) కలిపారని చంద్రబాబు అబద్ధమాడి చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే సుప్రీంకోర్టు(Supreme court) నుంచి కూడా తిట్లు తినాల్సి వచ్చింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తారా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆధారాలు చూపాలని సర్వోన్నత న్యాయస్థానం అడగడంతో ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానం లేక తడుము కోవాల్సి వచ్చింది. అసలు టీటీడీ ఈవో శ్యామలరావు(TTD EO Shymala Rao) కల్తీ నెయ్యిని వాడలేదని చెబుతూ వస్తున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు(Pawan kalyan) మహత్తర నాటకానికి తెర తీశారు. ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కొత్త అవతారం ఎత్తిన పవన్‌కు లడ్డూ విషయంలో తప్పు జరగలేదని తెలియదా? తెలిసి కూడా ఎందుకీ నాటకాలు అని జనం అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఇప్పుడు ఆనందపడుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని అందరికీ తెలిసిపోయింది. సోషల్ మీడియాలో అయితే చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబునాయుడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనే విషయం మరోసారి రుజువయ్యిందని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబుకు ప్రజలంటే భయం లేకపోవచ్చు, జగన్ అంటే భయం లేకపోవచ్చు, వేంకటేశ్వరస్వామికైనా భయపడాలి కదా? అని నెటిజన్లు అడుగుతున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం గురించి పట్టించుకోకుండా జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే కుతంత్రంతో అబద్ధమాడి భయంకరమైన తప్పు చేశారని కామెంట్ చేస్తున్నారు.