టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill Development case)లో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు(Supreme court) వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళ కూడా వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ.. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill Development case)లో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు(Supreme court) వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళ కూడా వాడీవేడిగా వాదనలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ.. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపులా వాద‌న‌లు విన్న అనంత‌రం.. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా ప్రారంభమైనా.. అది కూడా మంగళవారానికి వాయిదా పడింది.

Updated On 13 Oct 2023 5:50 AM GMT
Ehatv

Ehatv

Next Story