Supreme court Justice Comments : చంద్రబాబు లాయర్ వాదనలపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టులో(Supreme Court) టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) పిటిషన్‌పై(Petition) విచారణ వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను(Quash Petition) రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. రేపు కూడా కొనసాగనున్న వాదనలు. చంద్రబాబు నాయుడు తరపున లాయర్ హరీశ్ సాల్వే(Harish Salve) రెండు గంటలపాటు వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టులో(Supreme Court) టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) పిటిషన్‌పై(Petition) విచారణ వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను(Quash Petition) రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. రేపు కూడా కొనసాగనున్న వాదనలు. చంద్రబాబు నాయుడు తరపున లాయర్ హరీశ్ సాల్వే(Harish Salve) రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. 17ఏ పైనే వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. సీఐడీ(CID) తరపున రోహిత్గీ వాదనలు వినిపించారు. 17 ఏ ప్రకారం అరెస్ట్‌కు అనుమతి తీసుకోలేదని, కేసును క్వాష్ చేయాలని హరీశ్ సాల్వే వాదించారు. ఇదే సమయంలో 17 ఏ చంద్రబాబుకు అమలుకాదని చెప్పిన సీఐడీ తరపు లాయర్ రోహిత్గీ. అయితే విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన ఆరోపణగా ఉన్న అవినీతిని మర్చిపోతే ఎలా అని బేలా త్రివేది వ్యాఖ్యానించారు. 17A అనేది అవినీతి నిరోధానికి ఉండాలే కానీ కాపాడేందుకు కాదని చెప్పారు. ఇదే కదా 17 ఏ చట్టం అసలు ఉద్దేశమని తెలిపారు. .
అవినీతిని నిరోధించాలన్న మౌలిక ఉద్దేశం మాటేమిటని ప్రశ్నించారు. అనుమతి తీసుకోనంత మాత్రాన అవినీతిపై చర్చలు తీసుకోకూడదా అని బేలా త్రివేది ప్రశ్నించారు.