గురువారం అంటే రేపు సుప్రీంకోర్టులో(Supreme Court) ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును(Nara Chandrababu) నిందితుడుగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSR Congress) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ వేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు.

గురువారం అంటే రేపు సుప్రీంకోర్టులో(Supreme Court) ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడును(Nara Chandrababu) నిందితుడుగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి(CBI) అప్పగించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSR Congress) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ వేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్‌లో మాట్లాడిన ఆడియో ఏసీబీ బయటపెట్టింది. మనోళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నిర్ధారించింది. కేసు విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ 'సాక్ష్యాలు అన్ని ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం దొరుకుతుందా? తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు. అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు. ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు ఎగ్గు లేకుండా బుకయిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. 'నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు. నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అవుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది. ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు. రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Updated On 17 April 2024 7:12 AM GMT
Ehatv

Ehatv

Next Story