తిరుపతి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం. తిరుపతికి వెళ్లి వచ్చారంటే లడ్డూ తెచ్చావా అంటారు.

తిరుపతి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం. తిరుపతికి వెళ్లి వచ్చారంటే లడ్డూ తెచ్చావా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, కల్తీ నూనె కలిసిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందన్న వార్తల పట్ల తీవ్రంగా స్పందించారు. తిరుపతి లడ్డూను కల్తీ చేశారని పదునైన విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్క హిందువు బయటకురావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు తిరుపతిని శుద్ధి కూడా చేశారు. తమిళ్‌ హీరో కార్తీ, సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌లను కూడా ఏకిపారేశారు. లడ్డూ విషయంలో ఎవరైనా అతి చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అంతేకాకు సనాతన ధర్మం అంటూ దీక్షకు దిగారు. రేపు తిరుపతిలో దీక్ష విరమిస్తాని తెలిపారు. అయితే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు పలు సందేహాలను వ్యక్త పరిచింది. అసలు కల్తీ నెయ్యి వాడారన్న వార్తలకు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణ జరగకముందే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎలా ప్రకటిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడనట్లు స్పష్టంగా మనకు తెలుస్తోంది. లడ్డూ కల్తీ వివాదంపై ఒంటికాలితో లేచిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఇప్పుడు ఎలా స్పందిస్తారోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ehatv

ehatv

Next Story