జగన్(YS Jagan) ఆస్తుల కేసులో(Assests case) ఊరటనిచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు(supreme court) వెలువరించింది.
జగన్(YS Jagan) ఆస్తుల కేసులో(Assests case) ఊరటనిచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు(supreme court) వెలువరించింది. ఐఏఎస్‌లు, న్యాయమూర్తులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరమని చెప్పే సీఆర్‌పీసీ 197 (1) మనీలాండరింగ్(Money laundering) నిరోధక చట్టం కింద కేసులకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. ముందస్తు అనుమతి లేని కారణంగా ఒక ఐఏఎస్ అధికారిపై కాగ్నిజెన్స్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన అప్పీల్‌ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య భూ కేటాయింపుల్లో అధికారిక పదవిని దుర్వినియోగం చేశారని.. ఆస్తులను తక్కువ అంచనా వేయడం, అనధికారిక రాయితీలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడంతోపాటు ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని.. ఈ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రముఖ వ్యక్తులతో ఆచార్య కుట్ర పన్నారని ED ఆరోపించింది.
CrPC సెక్షన్ 197 ప్రకారం ప్రాసిక్యూషన్ కోసం ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరమని వాదిస్తూ, తాను అధికారిక హోదాలో పనిచేశానని బీపీ ఆచార్య(BP acharya) వాదించారు. PMLA, సెక్షన్ 65, 71 కింద నిబంధనలతో కూడిన ప్రత్యేక శాసనం కాబట్టి అటువంటి అనుమతి అవసరం లేదని ED వాదించింది. ప్రైవేట్ లాభం కోసం అధికారిక అధికారాలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, తద్వారా సెక్షన్ 197 CrPC అందించే రక్షణను నిరాకరిస్తున్నట్లు ED పేర్కొంది. PMLA అనేది అన్నింటికీ పూర్తి కోడ్‌ను అందించే ప్రక్రియ కాబట్టి PMLA కింద జరిగే చర్యలకు అనుమతి అవసరం లేదని ED వాదించింది. ఈడీ వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.